Begin typing your search above and press return to search.

త్రిష‌పై మ‌న్సూర్ వ్యాఖ్య‌ల్ని ఖండించిన క‌న‌గ‌రాజ్

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై అస‌భ్య‌క‌ర‌ స్త్రీవిద్వేష వ్యాఖ్యలకు సీనియర్ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు

By:  Tupaki Desk   |   19 Nov 2023 6:16 AM GMT
త్రిష‌పై మ‌న్సూర్ వ్యాఖ్య‌ల్ని ఖండించిన క‌న‌గ‌రాజ్
X

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై అస‌భ్య‌క‌ర‌ స్త్రీవిద్వేష వ్యాఖ్యలకు సీనియర్ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు. బ్లాక్ బస్టర్ 'లియో'లో త్రిషతో రేప్ సన్నివేశాలు చేసే అవకాశం రాకపోవడంతో నిరాశ చెందానని మన్సూర్ అలీఖాన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రిష‌తో న‌టించే అవ‌కాశాన్ని క‌ల్పించ‌లేద‌ని ఆవేద‌న చెందాడు. వేలాది మంది నెటిజన్లు సినీ ప్రముఖులు అత‌డి వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. త్రిష కూడా గత రాత్రి X మాధ్య‌మంలోకి మన్సూర్ అసభ్యకరమైన వ్యాఖ్యలను ఖండించారు.

త్రిష ట్వీట్ చేసిన వెంటనే, లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్ర‌ ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసారు. ''మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు విని నిరుత్సాహానికి ఆగ్రహానికి గురయ్యాము. మేమంతా ఒకే టీమ్‌(లియో)లో పనిచేశాము. మహిళలు, తోటి కళాకారులు -వృత్తి నిపుణుల పట్ల ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా గౌరవం ఉండాలి. ఎక్క‌డా ఇలాంటి అస‌భ్య‌త‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కూడ‌దు. నేను మ‌న్సూర్ ప్రవర్తనను క‌చ్చితంగా ఖండిస్తున్నాను'' అని లోకేష్ ట్వీట్ చేశారు.

మొదట్లో లియో లాంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లో మన్సూర్ లాంటి తెలివితక్కువ నటుడిని తీసుకున్నందుకు నెటిజనులోని ఒక వర్గం లోకేష్‌ను టార్గెట్ చేసింది. అయితే మన్సూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేసిన వెంటనే లోకేష్ పై త్రిష అభిమానుల నుండి సానుకూల‌త వ్య‌క్త‌మైంది. చాలా మంది త్రిష అభిమానులు ధన్యవాదాలు చెబుతూ లోకేష్ కి రిప్లైలు ఇచ్చారు. మ‌న్సూర్ లాంటి న‌టుల‌కు ప‌రిశ్ర‌మ అవ‌కాశాలివ్వ‌కూడద‌ని కూడా వ్యాఖ్యానించారు.

అత‌డిపై అభిమాన‌మే ముప్పు తెచ్చింది:

నిజానికి మ‌న్సూర్ న‌ట‌న‌కు తాను అభిమానిని అని లోకేష్ క‌న‌గ‌రాజ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అత‌డికి త‌ల బొప్పి క‌ట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను త్రిష అభిమానులు గుర్తు చేస్తూ తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. అంతేకాదు.. గ‌తంలో దర్శకుడు లోకేష్ త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఖైది (కైతి) స్క్రిప్టును మన్సూర్ అలీఖాన్ కోసం రాశాన‌ని అన్నారు. ఇది కూడా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా తెలుసు. దీనివ‌ల్ల కూడా లోకేష్ బాధితుడిగా మారారు. మ‌న్సూర్ అలీఖాన్ లాంటి నోటి దురుసు న‌టుడిపై అభిమానం కూడా ఇప్పుడు రివ‌ర్స‌యింద‌ని అర్థం చేసుకోవాలి. ఇక‌పై మ‌న్సూర్ అలీఖాన్ కి త‌మిళ సినీరంగంలో ఛాన్సులిచ్యేవాళ్లు ఉండ‌ర‌ని కూడా త్రిష అభిమానుల ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.