Begin typing your search above and press return to search.

నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ డైరెక్టర్‌

కార్తీ తో రూపొందించిన 'ఖైదీ' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్

By:  Tupaki Desk   |   15 March 2024 11:30 PM GMT
నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ డైరెక్టర్‌
X

కార్తీ తో రూపొందించిన 'ఖైదీ' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. మాస్టర్ సినిమాతో కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా నిలిచాడు. ఇక యూనివర్శిల్ స్టార్‌ కమల్ హాసన్ తో 'విక్రమ్‌' ను రూపొందించి పాన్ ఇండియా స్టార్‌ దర్శకుల జాబితాలో చేరి పోయాడు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్ ను నటుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కమల్‌ హాసన్ మరియు శృతి హాసన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు లోకేష్ కనగరాజ్ రెడీ అన్నాడు. అయితే సినిమాల్లో కాకుండా ఒక మ్యూజిక్ వీడియో లో లోకేష్ నటుడిగా కనిపించబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కమల్‌ హాసన్ సొంత బ్యానర్‌ లో ఒక మ్యూజిక్ వీడియోను రూపొందించబోతున్నారు. ఆ మ్యూజిక్ వీడియోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కనిపించబోతున్నాడు. హీరోయిన్‌ శృతి హాసన్ కూడా మ్యూజిక్ వీడియోలో కనిపించబోతుంది. ఆమె నటించడం మాత్రమే కాకుండా సంగీతం అందించడంతో పాటు, కాన్సెప్ట్‌ డిజైన్ ఇంకా దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మ్యూజిక్ వీడియోకు కమల్‌ సాహిత్యం అందించడం మరో ప్రత్యేకత. సాధారణంగా సౌత్‌ లో మ్యూజిక్ వీడియోలకు పెద్దగా క్రేజ్ ఉండదు. కానీ లోకేష్ కనగరాజ్ వంటి స్టార్‌ దర్శకుడు నటించడం, యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ సాహిత్యం అందించడంతో పాటు నిర్మించడం.. ఇక శృతి హాసన్ సంగీతం అందించడంతో పాటు కాన్సెప్ట్‌ డిజైన్ చేసి నటించడం వంటి కారణాల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మ్యూజిక్ వీడియోకు ఇనిమెల్‌ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తారు అంటూ సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా తమిళం మరియు తెలుగు లో ఈ మ్యూజిక్ వీడియో ను రెడీ చేస్తున్నారట.