Begin typing your search above and press return to search.

'లియో' కి అది ప్లస్ అవుతుందా? మైనస్ అవ్వనుందా?

'విక్రమ్‌' తో పాన్ ఇండియా స్థాయిలో సెన్షేషనల్ సక్సెస్‌ ని దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ తో రూపొందించిన 'లియో' సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   6 Oct 2023 7:30 AM GMT
లియో కి అది ప్లస్ అవుతుందా? మైనస్ అవ్వనుందా?
X

'విక్రమ్‌' తో పాన్ ఇండియా స్థాయిలో సెన్షేషనల్ సక్సెస్‌ ని దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ తో రూపొందించిన 'లియో' సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల కాబోతున్న లియో సినిమాకు సంబంధించి నిర్మాత లలీత్ కుమార్ చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది.

లియో సినిమాను మల్టీప్లెక్స్ ల్లో కాకుండా సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో మాత్రమే విడుదల చేయబోతున్నట్లుగా ట్విట్టర్ ద్వారా లలీత్‌ ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో మల్టీ ప్లెక్స్ ల ద్వారా మాత్రమే నిర్మాతలకు అధిక లాభాలు వస్తున్నాయి అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌. అలాంటిది లియోను మల్టీప్లెక్స్ రిలీజ్‌ స్కిప్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ టాక్ వినిపిస్తుంది.

ఉత్తర భారతంలో ఎక్కువగా మల్టీప్లెక్స్ ల్లో సినిమాలను ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. కనుక అక్కడి ప్రేక్షకులు లియో సినిమాను మిస్‌ అవుతామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాత లలీత్ కుమార్ మరోసారి స్పందిస్తాడేమో చూడాలి.

నిజంగానే మల్టీప్లెక్స్ రిలీజ్ ను స్కిప్‌ చేసినట్లయితే లియో సినిమాకు అది ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనే లెక్కలు వేస్తున్నారు. రెండు వేల సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో లియోను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. కనుక మల్టీప్లెక్స్ రిలీజ్ లేకున్నా కూడా భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన లియో ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. లోకేష్ మరోసారి అద్భుతాన్ని ఆవిష్కరించినట్లు అనిపిస్తుందని... మరో యూనివర్స్ లోకి లోకేష్ లియో తో తీసుకు వెళుతున్నట్లుగా అనిపిస్తుందని విజయ్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్‌ తో పాటు ఎంతో మంది ప్రముఖులు నటించారు.