Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ గోల తట్టుకోలేకపోతున్న LCU మేకర్

ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతను పేర్కొన్నారు. ఫ్యాన్స్ వార్ కారణంగా అభిమానులు తనని ట్యాగ్ చేసి ఓ విధమైన టార్చర్ చూపిస్తున్నారని అన్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:30 AM GMT
ఫ్యాన్స్ గోల తట్టుకోలేకపోతున్న LCU మేకర్
X

కోలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి లోకేష్ కనగరాజ్. తాజాగా ఇళయదళపతి విజయ్ లియో చిత్రంతో లోకేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చి తన అదృష్టాని పరీక్షించుకున్నారు. ఈ సినిమాకి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో 100 కోట్లకి పైగా కలెక్షన్ వచ్చింది. రెంది రోజు కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మూవీకి మాత్రం మిక్సడ్ టాక్ వచ్చింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన గత సినిమాలతో పోల్చుకుంటే లియో వెయిట్ కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదనే స్పందన ఆడియన్స్ నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

ఇది కొన్ని సందర్భాలలో శృతిమించిపోతూ ఉంటుంది. ఏకంగా దర్శకులు, హీరోలని ట్యాగ్ చేసి అభిమానులు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇళయదళపతి విజయ్ కి తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే విజయ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. అతని మూవీ వచ్చిందంటే ఎలా ట్రోల్ చేయాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు.

ఈ ఫ్యాన్ వార్ కి ఈ సారి లోకేష్ కనగరాజ్ బుక్ అయిపోయారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతను పేర్కొన్నారు. ఫ్యాన్స్ వార్ కారణంగా అభిమానులు తనని ట్యాగ్ చేసి ఓ విధమైన టార్చర్ చూపిస్తున్నారని అన్నారు. అభిమానం ఒక హద్దుల వరకు ఉంటే భరించవచ్చు. కాని ఒక్కోసారి వారి మాటలు చాలా నీచంగా ఉంటాయి.

వాటిని తట్టుకోవడం చాలా కష్టం. ఫ్యాన్ వార్ కారణంగా జరిగే ట్రోలింగ్ లో నన్ను బాధితుడిని చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని అనుకుంటున్న అని ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా అనేది రెండు గంటల వినోదం మాత్రమే. దాని తర్వాత మన లైఫ్ లో ఇంకా చాలా పనులు ఉంటాయి వాటి మీద అభిమానులు దృష్టి పెట్టాలని సూచించాడు. చిన్న సినిమాలని ప్రోత్సహించాలనే ఉదేశ్యంతోనే సోషల్ మీడియాలో తాను ఇంకా ఉన్నానని చెప్పుకొచ్చాడు.