Begin typing your search above and press return to search.

లోకేష్ కనగరాజ్.. బడా దర్శకులలో టాప్ బ్రాండ్

లోకేష్ నుంచి మూవీ వస్తుంది అంటే కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 4:12 AM GMT
లోకేష్ కనగరాజ్.. బడా దర్శకులలో టాప్ బ్రాండ్
X

కోలీవుడ్ లో శంకర్, మణిరత్నం, ఏఆర్ మురుగదాస్, అత్లీ లాంటి స్టార్ దర్శకులు ఉన్నారు. అయితే తక్కువ టైం కేవలం మూడు సినిఅలతో ఈ దర్శకులు అందరిని బీట్ చేసుకొని లోకేష్ కనగరాజ్ ఇప్పుడు టాప్ చైర్ లో కూర్చున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం అతని సినిమాకి జరుగుతోన్న మార్కెట్ చూస్తేనే లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యిందో చెప్పొచ్చు.

ఎన్నో హిట్ సినిమాల తర్వాత శంకర్ సౌత్ ఆడియన్స్ కి చేరువ అయ్యాడు. తన పేరుని బ్రాండ్ గా మార్చుకొని హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చేలా చేసుకున్నాడు. అంతకంటే ముందు మణిరత్నం ఆ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ ఖైది, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో యునిక్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు.

లోకేష్ నుంచి మూవీ వస్తుంది అంటే కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే భాషలకతీతంగా ప్రేక్షకులు అతని సినిమాలకి బ్రహ్మరథం పడుత్న్నారు. కోలీవుడ్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా లియో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ విజయ్ క్రేజ్ వచ్చినవి అనేకంటే లోకేష్ పేరుతో వచ్చిన ఇమేజ్ కారణం అని చెప్పాలి.

తెలుగులో కూడా స్ట్రైట్ చిత్రాలైన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ లియో చిత్రానికి అయ్యాయి. దీనిని బట్టి తెలుగునాట కూడా తనకంటూ బ్రాండ్ ని లోకేష్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పాలి. సౌత్ ఇండియాలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఇప్పడు నెక్స్ట్ పొజిషన్ లో దేశ వ్యాప్తంగా తన పేరు వినిపించుకునేలా చేసే దర్శకుడిగా లోకేష్ ఉన్నాడు.

లియో మూవీ సూపర్ హిట్ అయితే కచ్చితంగా కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమాని అందించే దర్శకుడు అతనే అవుతాడని చెప్పొచ్చు. జవాన్ సినిమాతో అత్లీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన ఆ మూవీ తమిళ్ సినిమా కేటగిరీలోకి రాలేదు. ఇప్పుడు లోకేష్ కి మాత్రం ఆ రికార్డ్ ని లియో సినిమాతో క్రియేట్ చేసే అవకాశం లభించింది.