Begin typing your search above and press return to search.

లోకేష్ LCU షార్ట్ ట్విస్ట్

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో స్టార్ హీరోలతో సినిమాలు చేసి, తన మేకింగ్ తో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:18 AM GMT
లోకేష్ LCU షార్ట్ ట్విస్ట్
X

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రజెంట్ సౌత్ టాప్ 5 డైరెక్టర్స్ లో ఇతను కూడా ఒకడు. రీసెంట్ గా లియో మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. లియో తర్వాత సౌత్ లో లోకేష్ కి డిమాండ్ భారీగా పెరిగింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో స్టార్ హీరోలతో సినిమాలు చేసి, తన మేకింగ్ తో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు లోకేష్. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కన్నా ముందు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ 'ఖైదీ 2'. డైరెక్టర్ గా లోకేష్ కి భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కి కొనసాగింపుగా 'ఖైదీ 2' తెరకెక్కాల్సి ఉంది.

అయితే ఈ ప్రాజెక్టు కన్నా ముందు లోకేష్ ఓ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంబంధాలను కలుపుతూ ఈ షార్ట్ ఫిలిం తీశాడట లోకేష్ కనగరాజ్. దీనిని నిడివి కేవలం పది నిమిషాలు మాత్రమే అని అంటున్నారు. లోకేష్ తో పాటు నరేన్ కూడా ఈ షార్ట్ ఫిలిం లో భాగం పంచుకున్నాడు.

ఖైదీలో ఢిల్లీ నుంచి లియో దాకా అందరూ ఈ మాఫియా ప్రపంచంలో ఒకరితో ఒకరు ఎలా ముడిపడ్డారు అనే విషయాలను వివరిస్తూ కొన్ని షాకింగ్ అంశాలను ఈ షార్ట్ ఫిలిం లో రివిల్ చేయబోతున్నాడట. అయితే దీన్ని థియేటర్స్ లో కాకుండా సరైన టైమ్ చూసి యూట్యూబ్లో అందరూ ఉచితంగా చూసేలా రిలీజ్ చేయాలని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

అయితే ఆడియన్స్ ఎదురుచూస్తున్న 'ఖైదీ 2' ప్రాజెక్టుకి మరింత టైం పట్టేలా ఉంది. ఎందుకంటే రజనీకాంత్ సినిమా స్టార్ట్ చేసే లోపు 2024 సమ్మర్ వచ్చేస్తుంది. ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తయి థియేటర్స్ లో రావడానికి మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాతే ఖైదీ 2 ఉండొచ్చు. దీనికన్నా ముందు సూర్యతో రోలెక్స్ ప్రాజెక్ట్ ప్లానింగ్ కూడా ఉంది కానీ వీటిలో ఏది ముందు తీయాలో లోకేష్ ఇంకా తేల్చుకోలేదు. ఇక రీసెంట్ గా జపాన్ తో డిజాస్టర్ అందుకున్న కార్తి ఖైదీ 2 పట్ల చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. మరి ఈ ప్రాజెక్టును లోకేష్ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.