Begin typing your search above and press return to search.

ఆ లోకం నుంచి బయటకురాని లోకేష్

ఈ పరిస్థితిలో దర్శకుడిగా లోకేష్ కచ్చితంగా ఈ మాఫియా, డ్రగ్స్ నేపథ్యం నుంచి బయటకొచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:35 AM
ఆ లోకం నుంచి బయటకురాని లోకేష్
X

లోకేష్ కనగరాజ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్నాడు. ఖైది, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న లోకేష్ రీసెంట్ గా లియోతో మరో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలన్నీ కూడా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ కథలతోనే తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఒక్క మాస్టర్ తప్ప మిగిలిన మూడు సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కాయి.

ఇదిలా ఉంటే రీసెంట్ గా లోకేష్ ఫైట్ క్లబ్ అనే సినిమాని నిర్మించారు. ఈ మూవీ కూడా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ స్టొరీతోనే తెరకెక్కడం విశేషం. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి కథ రాయడం కోసం ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ డ్రగ్స్ నేపథ్యంలోనే స్టొరీతోనే సూపర్ స్టార్ట్ తో లోకేష్ మూవీ చేస్తాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కూడా కేవలం తనకి బలం ఉన్న కమర్షియల్ లైన్ లోనే సినిమా చేస్తూ వెళ్తే ఒకానొక దశలో ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తాయి. ఆ తరువాత మరల కెరియర్ ని నిలబెట్టుకోవడానికి కుస్తీలు పడాలి.ఇప్పుడు లోకేష్ కూడా తన సినిమాలన్నింటికీకి మాఫియా, డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ కథలనే సిద్ధం చేస్తున్నాడు.

ఇలా ట్రై చేయడం వలన లియో సినిమా విషయంలో కొంత తేడా కొట్టింది. సూయ బ్రేక్ ఈవెన్ వచ్చిన కూడా విపరీతంగా విమర్శలు వచ్చాయి. ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ పరిస్థితిలో దర్శకుడిగా లోకేష్ కచ్చితంగా ఈ మాఫియా, డ్రగ్స్ నేపథ్యం నుంచి బయటకొచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

లేదంటే మూసధోరణిలో ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉండదు. రొటీన్ డ్రామాని చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ విషయం చాలా సందర్భాలలో రుజువైంది. ప్రస్తుతం లోకేష్ మాత్రమే కాకుండా చాలా మంది దర్శకులు మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతోనే మూవీస్ చేస్తున్నారు. ఇలాంటి కథలకి పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతున్నారు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు.