అవెంజర్స్ స్టార్ నాటు నాటు స్టిల్ చూశారా..?
అవెంజర్స్ స్టార్ టామ్ హిడిల్ స్టన్ నాటు నాటు సాంగ్ లోని ఐకాన్ పోస్టర్ ఇచ్చి అదరగొట్టారు. అవెంజర్స్ స్టార్ గా లోకి సీరీస్ తో టామ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2023 12:53 PM GMTట్రిపుల్ ఆర్ సినిమా సృష్టించిన సంచలనాలు గురించి అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం వల్ల ప్రపంచ సినీ ప్రేమికులకు ఆ సాంగ్ ఫీవర్ అంటుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేయడం చూశాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సాంగ్ కి కాలు కదిపారు. వారిలో లేటెస్ట్ గా అవెంజర్స్ నటుడు చేరాడు.
అవెంజర్స్ స్టార్ టామ్ హిడిల్ స్టన్ నాటు నాటు సాంగ్ లోని ఐకాన్ పోస్టర్ ఇచ్చి అదరగొట్టారు. అవెంజర్స్ స్టార్ గా లోకి సీరీస్ తో టామ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. లోకి 1 సెన్సేషనల్ హిట్ కాగా లేటెస్ట్ గా రిలీజైన లోకి 2 కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. జపాన్ లో జరుగుతున్న టోకియో కామిక్ కన్ ఈవెంట్ లో టాం నాటు నాటు పోస్టర్ స్టెప్ ని రీ క్రియేట్ చేసి జపాన్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ ని అలరించారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా రిలీజై దాదాపు 20 నెలలు అవుతున్నా సరే RRR సినిమా గురించి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉంది. నాటు నాటు సాంగ్ ని చంద్రబోస్ రచించారు. అయితే నాటు నాటు సాంగ్ కి లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఆస్కార్ దక్కించుకోవడంపై చిల్కూరి శుశీల్ రావు ఆస్కార్ చల్లగరిగ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించారు.
ఆస్కార్ గెలిచుకున్న తర్వాత చంద్రబోస్ తన సొంతూరికి వెళ్లినప్పుడు అనుభూతులు, సంబరాలు చూపిస్తూ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. రీసెంట్ గా ఈ డాక్యుమెంటరీ ని ఫ్రాన్స్ లో నిర్వహిస్తున్న నెలవారీ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది. ఇప్పటికే ముంబైలో జరిగిన షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఆస్కార్ చల్లగరిగ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. RRR సినిమాతో మన హీరోలు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లకు గ్లోబల్ వైజ్ క్రేజ్ ఏర్పడింది. అందుకే వీరు చేస్తున్న తర్వాత సినిమాలకు పాన్ వరల్డ్ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. RRR కు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు ఆ సినిమా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మహేష్ సినిమా మీద గ్లోబల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.