Begin typing your search above and press return to search.

లియో ద‌ర్శ‌కుడు లోకేష్ BMW 7 కార్ సెల్ఫ్‌ గిఫ్ట్?

తాజా స‌మాచారం మేర‌కు లోకేష్ కార్ గ్యారేజీలోకి స‌రికొత్త బీఎండ‌బ్ల్యూ 7 సిరీస్ కార్ చేరింద‌ని తెలిసింది. రూ.1.70 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును అత‌డు కొనుగోలు చేశారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 2:06 PM GMT
లియో ద‌ర్శ‌కుడు లోకేష్ BMW 7 కార్ సెల్ఫ్‌ గిఫ్ట్?
X

'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్ సక్సెస్ స్ట్రీక్ ని ఆస్వాధిస్తున్నాడు. వ‌రుసగా క్రేజీ హీరోల‌తో భారీ లైన‌ప్ ని క‌లిగి ఉన్న అత‌డు భార‌త‌దేశంలో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరాడు. క‌మ‌ల్ హాస‌న్ - విజ‌య్ - ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు అత‌డి కాల్షీట్ల కోసం వేచి చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇక త‌న హీరోల నుంచి ఖ‌రీదైన కార్ల‌ను అత‌డు కానుక‌గా అందుకుంటున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు లోకేష్ కార్ గ్యారేజీలోకి స‌రికొత్త బీఎండ‌బ్ల్యూ 7 సిరీస్ కార్ చేరింద‌ని తెలిసింది. రూ.1.70 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును అత‌డు కొనుగోలు చేశారు. బ్లాక్ సఫైర్ మెటాలిక్ కలర్ కార్ స్ట‌న్నింగ్ లుక్ తో మైమ‌రిపిస్తోంది. లోకేష్ కారుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో ద‌ళ‌పతి విజయ్ తో అత‌డు తెర‌కెక్కించిన‌ 'లియో' విడుదలకు సిద్ధమవుతున్న వేళ త‌న కార్ గ్యారేజీలోకి కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్ట‌యింది. అత‌డు షేర్ చేసిన ఫోటోలో.. కారు తాళాలను అందుకుంటూ క‌నిపించాడు. ఖ‌రీదైన ఈ కారు మోడల్ అద్భుతమైన డిజైన్ తో మైమ‌రిపిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో ఈ మోడ‌ల్ లాంచ్ అయింది. ప్రస్తుతం 7340i అనే ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారులో 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ .. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయని తెలుస్తోంది. గతేడాది లోకేశ్‌కు రూ. రూ. 65 లక్షలు ఖ‌రీదు చేసే ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ ని క‌మల్ హాస‌న్ కానుక‌గా ఇచ్చారు.

లోకేష్ నుంచి గ‌తంలో విక్ర‌మ్ - ఖైదీ (కైతి) లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు లియో సంచ‌ల‌నాలు సృష్టించేందుకు వ‌స్తోంది. ఈ సినిమా బిజినెస్ హైప్ ప్ర‌తిదీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారుతున్నాయి. కమల్ హాసన్ - విక్రమ్.. కార్తీ- కైతిలతో కూడిన లోకేష్ కనగరాజ్ సినిమా విశ్వం(యూనివ‌ర్శ్‌)లో విజ‌య్ -లియో ఒక భాగమని ఇప్ప‌టికే కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. మునుముందు క‌మల్- విజ‌య్- కార్తీ క‌లిసి ప‌ని చేసేందుకు ఇది మార్గాన్ని సుగ‌మం చేసింది. లియో చిత్రంలో త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు నటించారు. బాలీవుడ్ న‌టుడు అనురాగ్ కశ్యప్ కూడా నటీనటుల జాబితాలో చేరాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప‌తాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ లియో ను నిర్మిస్తున్నారు.