ముగింపు వేళ వివాదాలు ఓ మచ్చలా!
కొన్ని నెలల క్రితం తొలుత మంచు కుటుంబంలో అన్నదమ్ములు విష్ణు- మనోజ్ మధ్య వివాదం ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Tupaki Desk | 24 Dec 2024 1:30 PM GMT2024 ముగింపు వేళ టాలీవుడ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలు ఇండస్ట్రీని ఊపిరాడ కుండా చేస్తున్నాయి. ఒకటి సమసిపోయిందంటే ? అంతలోనే మరో వివాదం తెరపైకి వస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మునుపెన్నడు ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. ఇండస్ట్రీలో జరుగుతోన్న వరుస పరిణామాలు చూస్తుం టే? పరిశ్రమకు ఏదో కీడు సెంకించినట్లే కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం తొలుత మంచు కుటుంబంలో అన్నదమ్ములు విష్ణు- మనోజ్ మధ్య వివాదం ఎంత సంచలనమైందో తెలిసిందే.
చివరకి ఎలాగూ ఆ వివాదం సద్దుమణిగింది అంటే? ఇప్పుడు వివాదంలోకి నేరుగతా మోహన్ బాబు కూడా ఎంటర్ అవ్వడంతో సన్నివేశం మరింత హీటెక్కింది. అదంతా ఒక ఎత్తైతే? ఆయన ఏకంగా రిపోర్ట్ పైనే దాడి చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసిన అంశం. ఈ వివాదం కంటే ముందు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెషన్ సెంటర్ ని హైడ్రా కూల్చివేత ఎంత సంచలనమైందో తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.
అటుపై అక్కినేని నాగచైతన్య-సమంత బంధాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతకు మించి చర్చకు తెర తీసింది విధితమే. నాగార్జున సురేఖపై పరువు నష్టం దావా కూడా వేయడంతో ఆ వివాదం కోర్టులో ఉంది. ఇక మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది అన్నది ఈ నాటి సమస్య కాదు. కొన్ని దశాబ్ధలుగా ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది అది పీక్స్ కు చేరింది.
అల్లు అర్జున్ వైకాపా నేతకు మద్దతివ్వడంతో? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో తెలిసిందే. దీంతో మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నేరుగా అల్లు అర్జున్ మామ కౌంటర్ వేయడంతో? సీన్ మరింత వేడెక్కింది. అదంతా ఒక ఎత్తైతే? బన్నీ-సంధ్య థియేటర్ ఘటన తో దేశ వ్యాప్తంగా టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నంతగా సీన్ మారింది. బన్నీ అరెస్ట్ అవ్వడం..రాత్రంతా జైలులో ఉండటం.. అటుపై విడుదల...మళ్లీ పోలీసుల విచారణకు బన్నీకి నోటీసులివ్వడం. ఇవన్నీ కూడా ఒకేసారి చోటు చేసుకోవడంతో? ఇండస్ట్రీకి ఎందుకిలా జరుగుతందనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఎన్నడు లేని కొత్త సమ్యలు ఇండస్ట్రీని ఇలా చుట్టు ముట్టాయి? ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.