Begin typing your search above and press return to search.

మరో చిన్న సినిమాతో లైన్ లో పడ్డ అనిరుధ్

సాధారణంగా సినిమాలకు సంబంధించి హీరోలు, హీరోయిన్లకు మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 12:02 PM GMT
మరో చిన్న సినిమాతో లైన్ లో పడ్డ అనిరుధ్
X

సాధారణంగా సినిమాలకు సంబంధించి హీరోలు, హీరోయిన్లకు మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్లకు సైతం అభిమానులు పెరుగుతున్నారు. ముఖ్యంగా కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ ఒకరు.

‘3’ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అనిరుథ్ రవిచందర్.. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కూడా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు.

గతంలో కంటే ఇప్పుడు హై రేంజ్ మూవీలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్న అనిరుథ్ రవిచందర్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాకు అద్భుతమైన బాణీలను సమకూర్చాడు. పాటలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేసేశాడు. దీనికితోడు ఈ చిత్రానికి పవర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సైతం ఇచ్చాడు. తద్వారా నేషనల్ వైడ్‌గా మంచి పేరును అందుకున్నాడు.

‘దేవర’ సినిమాను మినహాయిస్తే అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళంలో అతడి ట్రాక్ రికార్డు అంత మంచిగా లేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లియో’, ‘ఇండియన్ 2’, ‘వెట్టయాన్’ సినిమాలు మ్యూజిక్ పరంగా అనిరుథ్‌కు మంచి పేరును తీసుకు రాలేదనే చెప్పుకోవాలి.

కోలీవుడ్‌లో సరైన మ్యూజికల్ హిట్ కోసం చూస్తున్న అనిరుథ్ రవిచందర్ ఇప్పుడు ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (Love Insurance Kompany) అనే సినిమాకు వర్క్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధీమా ధీమా’ అంటూ సాంగే ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌ రిలీజ్ అయింది. దీనికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన లభిస్తోంది.

కొంత కాలంగా తమిళ చిత్రాలకు సరిగా సంగీతాన్ని అందించడం లేదు అని వస్తున్న విమర్శలకు అనిరుథ్ రవిచందర్ ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సాంగ్‌తో పుల్‌స్టాప్ పెట్టేశాడు అని చెప్పొచ్చు. అంతలా ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రం అనిరుథ్‌కు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. మరి ఈ మూవీలోని మిగిలిన పాటలు కూడా ఇదే రీతిలో మెప్పిస్తే అతడికి తిరుగు ఉండదు అనడంలో సందేహమే లేదు.