Begin typing your search above and press return to search.

రీమేక్‌ పెద్ద తప్పు... ఇందుకే దిల్‌ రాజు చేయలేదా!

దిల్‌ రాజు డబ్‌ చేసి విడుదల చేసిన సమయంలోనూ చాలా మంది రీమేక్ చేస్తే ఎక్కువ లాభం ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 12:30 PM GMT
రీమేక్‌ పెద్ద తప్పు... ఇందుకే దిల్‌ రాజు చేయలేదా!
X

ప్రదీప్ రంగనాథన్‌, ఇవానా జంటగా తమిళ్‌లో రూపొందిన 'లవ్‌ టుడే' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్‌ టుడే సినిమాతో ప్రదీప్ రంగనాథన్‌ దర్శకుడిగానూ మంచి పేరు దక్కించుకున్నాడు. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయ్యి యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న లవ్‌ టుడే సినిమాను తెలుగులో దిల్‌ రాజు మొదట రీమేక్ చేయాలని భావించారు. కానీ రీమేక్ చేయడం కంటే డబ్‌ చేసి విడుదల చేయడం శ్రేయస్కరం అని ఆయన భావించి సినిమాను డబ్‌ చేసి విడుదల చేయడం జరిగింది. దిల్‌ రాజు డబ్‌ చేసి విడుదల చేసిన సమయంలోనూ చాలా మంది రీమేక్ చేస్తే ఎక్కువ లాభం ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగులో దిల్‌ రాజు రీమేక్‌ చేయలేదు, కానీ హిందీలో ఈ సినిమాను రీమేక్ చేశారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో జునైద్‌, ఖుషి జంటగా 'లవ్‌ యాపా' టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ సినిమాతో సినిమాల్లో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సౌత్‌ సినిమాలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. దాంతో సౌత్‌ సినిమాకు రీమేక్‌ గా రూపొందిన 'లవ్‌ యాపా' గురించి విడుదలకు ముందు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ విడుదల తర్వాత సినిమాను జనాలు పట్టించుకోవడం లేదు. విడుదలైన మొదటి రోజే నెగటివ్‌ టాక్‌ రావడంతో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

లవ్‌ యాపా సినిమాలో నటించిన జునైద్‌, ఖుషి కపూర్‌లకు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో పాటు, సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో చూడాలనే ఆసక్తి ఉన్న వారు సైతం తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. దాంతో లవ్‌ యాపా సినిమా బాలీవుడ్‌లో మరో డిజాస్టర్ మూవీగా నిలువబోతుంది. ఇటీవల వచ్చిన దేవా సినిమా ఫలితమే తాజా లవ్‌ యాపా సినిమాకు దక్కిందంటూ బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. రీమేక్ చేసే ముందు ఆ కథ ప్రేక్షకులకు ఎంత వరకు ఎక్కుతుంది, ఇక్కడ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది ఆలోచించుకోవాలని, లేదంటే ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయనే అభిప్రాయంను రివ్యూవర్స్‌ వ్యక్తం చేశారు.

తెలుగులోనూ లవ్ టుడేను రీమేక్‌ చేసి ఉంటే ఇదే పరిస్థితి వచ్చి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సినిమాలను ఒరిజినల్‌గా చూస్తేనే ఫీల్‌ ఉంటుంది.. ఆ విజయం అనేది దక్కుతుంది. లవ్‌ టుడే వంటి సినిమాలు మ్యాజిక్‌ చేస్తాయి, కానీ ఆ మ్యాజిక్ అస్తమానం పని చేయదు. లవ్‌ టుడే సినిమా అనేది యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కథ. కానీ అన్ని భాషల్లోనూ అదే ఫార్ముల వార్కౌట్‌ అవుతుంది అనుకుంటే తప్ప అని లవ్‌ యాపా నిరూపించింది. ప్రేమికులు ఇద్దరు తమ మొబైల్స్ మార్చుకోవడం ద్వారా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ పరిణామాలను లవ్‌ టుడేలో ఫన్నీగా చూపించారు. ఆ ఫన్‌ రీ క్రియేట్‌ చేయడం అంత ఈజీ కాదు. కనుకే లవ్‌ యాపా సినిమా నిరాశ పరచింది.