Begin typing your search above and press return to search.

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఫన్నీగా లవ్@65 ట్రైలర్

అప్పటికే వాళ్లనే కాదు.. ఇప్పుడు జనరేషన్ మూవీ లవర్స్ ను కూడా అలరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Feb 2024 12:16 PM GMT
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఫన్నీగా లవ్@65 ట్రైలర్
X

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఫుల్ ఫార్మ్‌ లో ఉన్న నటుడు ఎవరంటే.. నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బడా హీరో సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే, మెయిన్ లీడ్ లో కూడా పలు మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు. థియేటర్ కంటెంట్ నుంచి ఓటీటీ వరకు అన్ని కవర్ చేస్తున్నారు. అప్పటికే వాళ్లనే కాదు.. ఇప్పుడు జనరేషన్ మూవీ లవర్స్ ను కూడా అలరిస్తున్నారు.


ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో మూడు సినిమాలు చేస్తున్నారు. షష్టి పూర్తి, లగ్గం మూవీలతోపాటు మూడో సినిమా లవ్@65 ఇటీవలే అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మూవీని తెరకెక్కిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ తో పాటు లీడ్ రోల్‌లో.. అలనాటి హీరోయిన్ జయప్రద నటిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ట్రైలర్ తో వచ్చారు. ఆద్యంతం కామెడీ ఎలిమెంట్స్ తో సాగుతున్న ట్రైలర్.. తెగ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సినిమా కథంతా.. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రేమ చుట్టూనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. హార్ట్ టచింగ్ సీన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. లేటు వయసులో ప్రేమ పుడితే నిజంగా ఇలా ఉంటుందా అని కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్.

సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జయప్రద ఇద్దరూ ఇంట్లో తెలియకుండా జంప్ అయిన సీన్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వారిద్దరు సాల్సా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తనకు అనుభవించే ప్రాయం ఇప్పుడే మొదలైందని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. కారులో వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్.. ఈ ప్రపంచాన్ని తమ ప్రేమను తిరస్కరిస్తే.. ప్రపంచాన్ని మనం బహిష్కరిస్తామని చెప్పిన డైలాగ్ క్రేజీగా ఉంది. ఆ తర్వాత ట్రైలర్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చారు మేకర్స్. అందరూ నన్ను ఏడిపించిన వాళ్లే.. నీకోసం ఏడ్చింది నీవు ఒక్కడివే అంటూ జయప్రద చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. మరి వీరి ప్రేమ సక్సెస్ అయిందో లేదా అనేది మిగతా సినిమా.

ఈ మూవీలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీఎన్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాల్లోని లవ్ స్టోరీస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. లవ్@65 సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.