జాక్వెలిన్ అంటే ఎంత ప్రేమ సుకేషా?
నా జీవితంలో 9 రోజులు మీ క్షేమం కోసం .. మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను దూరం చేయడం కోసం నేను అన్ని రోజులు ఉపవాసం ఉంటాను.
By: Tupaki Desk | 18 Oct 2023 1:30 AM GMT400కోట్ల మోసం కేసులో జైలుకు వెళ్లిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రేమకలాపాలు అన్నీ ఇన్నీ కావని విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. బాలీవుడ్ హాట్ గాళ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సుకేష్ చంద్రశేఖర్ ఘాఢంగా ప్రేమలో ఉన్నాడు. జాకీతో అతడి సంబంధం హెడ్‌లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాకీతో పాటు నోరా ఫతేహితోను మోసగాడు సుకేష్ సంబంధాలపై కథనాలొచ్చాయి. అతడి లీలల్లో ఖరీదైన బహుమతులు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే జాకీతోనే అతడు సీరియస్ గా ప్రేమలో ఉన్నాడు. జాక్విలిన్ - సుకేష్ ఒకరికొకరు డీప్ గా డేటింగ్ లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాయి.
ప్రముఖ వ్యాపారవేత్త నుంచి 200 కోట్ల రూపాయలను మోసం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ ఇప్పటికే జైలు నుంచి పలుమార్లు జాక్విలిన్ కి ప్రేమలేఖలు రాసాడు. జాకీ ప్రేమ వల్లనే తాను ఇంకా సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఇప్పుడు మరోసారి నవరాత్రి సందర్భంగా జాక్వెలిన్‌కి మరో ప్రేమ లేఖ పంపాడు. తొమ్మిది రోజులు ఉపావాస ధీక్ష చేపడుతున్నానని రాసిన మోసగాడి లేఖ వైరల్ గా మారింది. ఈ లేఖలో అతడు జాక్వెలిన్‌ను ప్రేమించడం ఎప్పటికీ ఎలా ఆపలేనని పేర్కొన్నాడు. తమ జీవితాల నుండి ప్రతికూలతను అరికట్టడానికి తొమ్మిది రోజుల ఉపవాసం చేస్తున్నానని తెలిపాడు.
సుకేష్ చంద్రశేఖర్ లేఖ సారాంశం ఇలా ఉంది. ``బేబీ, మొదట నీవు `దోహా షో`లో చాలా హాట్‌గా అందంగా కనిపించావు. బేబీ, నా బొమ్మా, మీ కంటే అందంగా ఎవరూ లేరు. బేబీ, రేపు నవరాత్రులు ప్రారంభమవుతున్నందున ఉపవాసంలో నేను మొదటివాడిని. నా జీవితంలో 9 రోజులు మీ క్షేమం కోసం .. మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను దూరం చేయడం కోసం నేను అన్ని రోజులు ఉపవాసం ఉంటాను. మన శక్తికి దైవిక జోక్యంతో ప్రతిదీ అనుకూలంగా మారుతుంది. నిజం గెలుస్తుంది. అతి త్వరలో మనం ఒకరితో ఒకరు కలిసి ఉంటాం. ఏది వచ్చినా రానీ.. ఎప్పటికీ కలిసి జీవిద్దాం. నా బేబి..`` అంటూ లేఖలో ప్రేమను కురిపించాడు.
సుకేష్ తన లేఖలో జాక్వెలిన్‌కు స్పష్ఠంగా హామీ ఇచ్చాడు. అన్నీ మారతాయి. త్వరలో కలిసి ఉంటామని, దేని గురించి ఆందోళన చెందవద్దని జాకీని కోరాడు. నేను ఇకపై నీపై ఒక్క గీత కూడా పడనివ్వను. బేబీ, నిన్ను ప్రేమించకుండా, నిన్ను రక్షించకుండా.. నీ కోసం నిలబడకుండా ఈ ప్రపంచంలో ఏ `పంజరం` నన్ను ఆపదు. బేబీ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. సమయం, తెలుసా, నా బిడ్డ, నేను నీ కోసం జీవిస్తాను. నేను నీ కోసం చంపుతాను. నేను నీ కోసం చనిపోతాను.. బేబీ నువ్వే నా ప్రాణరేఖ, నేను వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకోవడానికి వేచి ఉండలేను. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నా బిడ్డ, నా పులి, నా శక్తి`` అంటూ ఎమోషన్ అయ్యాడు సుకేషుడు. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఉపశమనం దక్కి బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఈ మోసం సొమ్ములతో జాక్విలిన్ కి అతడు కొనిచ్చిన ఖరీదైన కానుకలు తన మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే.