Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు కి పోటీగా జబర్దస్త్‌ కమెడియన్‌..!

దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి వచ్చేది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది

By:  Tupaki Desk   |   19 May 2024 4:28 AM GMT
దిల్‌ రాజు కి పోటీగా జబర్దస్త్‌ కమెడియన్‌..!
X

దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి వచ్చేది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా తన సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లను దిల్‌ రాజు ముందస్తుగానే హోల్డ్‌ చేసి పెట్టుకోవడంతో ఇతర సినిమాలు అదే తేదీన రావాలంటే తక్కువ థియేర్లతో రావాల్సి ఉంటుంది.

సమ్మర్‌ కానుకగా దిల్ రాజు బ్యానర్‌ నుంచి 'లవ్‌ మి' సినిమా రాబోతుంది. మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో దిల్‌ రాజు ఫ్యామిలీ హీరో అయిన ఆశిష్‌ నటించగా హీరోయిన్ గా బేబీ ఫేం వైష్ణవి చైతన్య నటించింది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు పోస్టర్స్ అంచనాలు పెంచాయి.

దిల్‌ రాజు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకుని నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాంటి ఈ సినిమాతో పాటు జబర్దస్త్‌ కమెడియన్‌ గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లవ్‌ మి సినిమాకు రాజు యాదవ్‌ పోటీగా రావాలని అనుకోలేదు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేయడం వల్ల రాజు యాదవ్‌ ఇప్పటికే విడుదల అవ్వాల్సింది వారం వాయిదా పడింది. దిల్ రాజు సినిమాకు పోటీ గా రాకుంటే ఆ తర్వాత వారం విడుదల చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఆ తర్వాత వారం మొత్తం ఫుల్‌ ప్యాక్ గా పలు సినిమాలు ఉన్నాయి. అందుకే గెటప్‌ శ్రీను కు మరో ఆప్షన్‌ లేకుండా పోయింది. చావో రేవో అన్నట్లుగా దిల్‌ రాజు సినిమాకి పోటీ గా రావాల్సి వచ్చింది అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల స్పందన.

గత రెండు మూడు వారాలుగా సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెల పోతుంది. ఇలాంటి సమయంలో మంచి సినిమాలు పడితే కచ్చితంగా రెండు మూడు ఉన్నా ప్రేక్షకులు చూసే అవకాశాలు ఉన్నాయి. కనుక దిల్‌ రాజు సినిమాకు పోటీ అయినా రాజు యాదవ్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయితే ఎవరూ ఆపలేరు. మరి ఆ పాజిటివ్‌ బజ్ వచ్చేనా అనేది చూడాలి.

--