Begin typing your search above and press return to search.

కంప్లీట్ స్టార్ మెగాస్టార్ కి ఛాన్స్ ఇచ్చిన‌ట్లు లేదే!

మాల‌యాళంతో పాటు త‌మిళ్, క‌న్న‌డం, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మార్చి 27న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:42 AM GMT
కంప్లీట్ స్టార్ మెగాస్టార్ కి ఛాన్స్ ఇచ్చిన‌ట్లు లేదే!
X

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా పృధ్వీరాజ్ సుకుమారన్ తెర‌కెక్కించిన 'లూసీఫ‌ర్' ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. అందులో హీరోయిజం...సినిమా స‌క్సెస్ చూసి మెగాస్టార్ చిరంజీవి అదే సినిమాని తెలుగులో మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో 'గాడ్ ఫాద‌ర్' గా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడీ చిత్రానికి కొన‌సా గింపుగా 'లూసీఫ‌ర్-2'' ఎంపురాన్' టైటిల్ తో అదే కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప తీసుకొచ్చాయి. త్వ‌ర‌లో అసలు సిస‌లైన ప్ర‌చారం మొద‌ల‌వుతుంది. రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకుని టీజ‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. భారీ పురాత‌న‌ భ‌వంతుల మ‌ధ్య దుమ్ములేపుకుంటూ దూసుకొస్తున్న బెంజ్ వాగన్ కార్స్ ను చూడొచ్చు. స్పాట్ లో ఎత్తైన గంట‌స్థ‌బం చుట్టూ లొకేష‌న్ కొత్త ఫీల్ ని తీసుకొస్తుంది.

దీంతో 'లూసీఫ‌ర్ -2'లో రెండింతల యాక్ష‌న్ ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం మరింత బ‌జ్ క్రియేట్ అయ్యే అవ‌కాశం ఉంది. అటుపై ట్రైల‌ర్ మ‌రింత ఎగ్జైట్ మెంట్ ని తీసుకొస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మాల‌యాళంతో పాటు త‌మిళ్, క‌న్న‌డం, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మార్చి 27న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా రిలీజ్ జ‌రిగితే ఈ చిత్రాన్ని మెగాస్టార్ రీమేక్ చేయ‌క‌పోవ‌చ్చు. 'లూసీఫ‌ర్' కేవ‌లం మల‌యాళంలో నే రిలీజ్ అవ్వ‌డంతో? తెలుగులో రీమేక్ చేసారు. కానీ 'లూసీఫ‌ర్ -2' పాన్ ఇండియా రిలీజ్ అనంత‌రం రీమేక్ చేసినా అంత ఎగ్జైట్ మెంట్ ఉండ‌దు. వాస్త‌వానికి 'గాడ్ ఫాద‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా? వాటిని అందులోక పోయింది. తెలుగులో ఆ చిత్రం యావ‌రేజ్ గానే ఆడింది.