Begin typing your search above and press return to search.

ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే..!

ఐతే ఈ సినిమాను పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడం ఆయన కూడా సినిమాలో భాగం అవడం స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 3:44 AM GMT
ఇది కదా కాన్ఫిడెన్స్ అంటే..!
X

ఈమధ్య చాలా సినిమాలు చివర్లో ట్విస్ట్ ఇస్తూ రెండో భాగం కొనసాగుతుందని అంటున్నారు. కొన్ని సినిమాలు మాత్రం కథను పూర్తి చేసి పాత్రలతో మరో కొత్త కథ చేస్తూ అదే ఫ్రాంచైజ్ లను కొనసాగిస్తున్నారు. ఐతే ఆడియన్స్ ఈ రెండు రకాల సీక్వెల్స్ లను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మలయాళంలో ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ వస్తుంది. అదే పృధ్విరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ కాంబోలో వస్తున్న సినిమాలు. ఇద్దరు కలిసి లూసిఫర్ అనే సినిమా తీయగా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది.

ఐతే కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ L2E ఎంపురాన్ అంటూ లూసిఫర్ సీక్వెల్ తో వస్తున్నారు. మార్చి 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ తోనే అదుర్స్ అనిపించారు. మళయాళం నుంచి వస్తున్న సూపర్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా L2E ఎంపురాన్ అదరగొట్టబోతుందనిపిస్తుంది. ఐతే ఈ సినిమాను పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడం ఆయన కూడా సినిమాలో భాగం అవడం స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.

L2E ఎంపురాన్ టీజర్ రిలీజ్ రోజే సినిమా మూడో ఫ్రాంచైజ్ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేశారు డైరెక్టర్ పృధ్విరాజ్ సుకుమారన్. లూసిఫర్ 2 మాత్రమే కాదు మూడో భాగం కూడా ఉంటుందని అన్నారు. దానికి సంబందించిన ట్విస్ట్ L2E ఎంపురాన్ చివర్లో ఉంటుందని అన్నారు. సినిమా రిలీజ్ ముందే మరో భాగం కూడా ఉంటుందని చెప్పడం వారి కాన్ ఫిడెన్స్ లెవెల్స్ ని తెలియచేస్తుంది.

ఒక సినిమా టీజర్ రిలీజ్ రోజే మరో భాగం కూడా ఉందని చెప్పడం ఆ కథ మీద వారు తీసిన సినిమా మీద ఉన్న నమ్మకం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. L2E ఎంపురాన్ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. టీజర్ లో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని అంశాలు పొందుపరిచారు. మరి లూసిఫర్ లానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి. పృధ్విరాజ్ సుకుమారన్ నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ 1 లో నటించిన ఆయన సీక్వెల్ లో ప్రభాస్ తో తలపడుతున్నాడని తెలిసిందే. సలార్ 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఈగ గా ఎదురుచూస్తున్నారు.