Begin typing your search above and press return to search.

నాల్గవ పెళ్లిపై స్టార్‌ సింగర్‌ ఆసక్తి!

ప్రముఖ గాయకుడు, పాటల రచయిత మక్సూద్ మహమూద్‌ అలీ అలియాస్‌ లక్కీ అలీ మరోసారి వార్తల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   9 Feb 2025 9:58 AM GMT
నాల్గవ పెళ్లిపై స్టార్‌ సింగర్‌ ఆసక్తి!
X

ప్రముఖ గాయకుడు, పాటల రచయిత మక్సూద్ మహమూద్‌ అలీ అలియాస్‌ లక్కీ అలీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకు మూడు సార్లు వివాహం చేసుకున్న ఈ గాయకుడు తన మూడో భార్య నుంచి 2017లో విడి పోయారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉన్న లక్కీ అలీ తాజాగా నాల్గవ పెళ్లి విషయమై ఆసక్తి కనబర్చుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో తోడు కావాలని కోరుకుంటున్నట్లు ఒక చిట్‌చాట్‌లో షేర్ చేయడంతో ఆయన నాల్గవ పెళ్లి ఆలోచన చేస్తున్నాడని, త్వరలోనే నాల్గవ సారి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

లక్కీ అలీ తన మొదటి వివాహంను 1996లో చేసుకున్నాడు. మేఘన జేన్‌ మెక్‌ క్లియరీని వివాహం చేసుకున్న లక్కీ అలీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మేఘన జేన్‌ నుంచి విడిపోయాడు. ఆ తర్వాత ఇనాయాను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. పర్షియన్‌ అయిన ఆమెతోనూ లక్కీ అలీ ఇద్దరు పిల్లలను కన్నాడు. ఇనాయాతోనూ ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో లక్కీ అలీ కొనసాగలేక పోయాడు. దాంతో చివరగా 2010లో బ్రిటిష్ మోడల్‌ కేట్ ఎలిజబెత్‌ హల్లమ్‌ను వివాహం చేసుకున్నాడు.

బ్రిటీష్‌ మాజీ అందాల రాణి అయిన రాణి కేట్‌ ఎలిజబెత్‌తో లక్కీ అలీ జీవితాంతం కలిసి ఉంటాడని అంతా భావించారు. కానీ ఆమెతోనూ విడి పోయాడు. 2017లో ఎలిజబెత్‌ హల్లమ్‌ నుంచి అలీ విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారి ద్వారా అయిదుగురు సంతానంను పొందిన లక్కీ అలీ మరోసారి కొత్త జీవితంలో అడుగు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తన మనసుకు నచ్చిన వ్యక్తి తారస పడితే ప్రేమలో పడాలని ఎదురు చూస్తున్నాడు. సాధారణంగా రెండు మూడు సార్లు పెళ్లి చేసుకుంటేనే చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు.

లక్కీ అలీ ఏకంగా నాల్గవ సారి పెళ్లికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో జనాలు ఆయన్ను ఏ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తారో చూడాలి. 66 ఏళ్ల వయసులో నాల్గవ పెళ్లిపై ఆసక్తిగా ఉందంటూ ప్రకటన చేయడం ద్వారా లక్కీ అలీ వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలో జన్మించిన ఇతడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో పాడటంతో పాటు తన సాహిత్యంను అందించాడు. విభిన్నమైన గాత్రంతో అలరించే లక్కీ అలీ ఎన్నో పాటలను రాయడం ద్వారా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. మొత్తానికి లక్కీ అలీ పాటలతో పాటు ఇలా పెళ్లి వార్తలతోనూ రెగ్యులర్‌గా వార్తల్లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం.