లక్కీ భాస్కర్.. రెండో రోజూ సాలిడ్ గానే..
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో నటించిన మరో స్ట్రయిట్ మూవీ లక్కీ భాస్కర్.
By: Tupaki Desk | 2 Nov 2024 5:22 AM GMTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో నటించిన మరో స్ట్రయిట్ మూవీ లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. ప్రీమియర్స్ షోతోనే మంచి టాక్ అందుకుని దూసుకుపోతోంది. సినీ ప్రియుల నుంచి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబడుతోంది.
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, వెంకీ అట్లూరి కథ, కథనం, తెరకెక్కించిన విధానం అదిరిపోయిందని అంతా ప్రశంసిస్తున్నారు. మధ్య తరగతి ఉద్యోగి జీవితంలో జరిగిన సంఘటనను చాలా బాగా చూపించారని చెబుతున్నారు. ఓవరాల్ గా మూవీ సూపర్ గా ఉందని కొనియాడుతున్నారు. సూపర్ రివ్యూస్ తో పాటు పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో లక్కీ భాస్కర్ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
తాజాగా మేకర్స్.. రెండు రోజుల వసూళ్ల వివరాలు రివీల్ చేశారు. రూ.26.2 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ప్రకటించారు యూనివర్సల్ దీపావళి బ్లాక్ బస్టర్ అని తెలిపారు. లక్కీ భాస్కర్ అన్ స్టాపబుల్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో బ్యాంక్ ముందున్న నిలుచునట్లు దుల్కర్ కనిపిస్తున్నారు. తన లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. రామ్ కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ సహా మరికొందరు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో లక్కీ భాస్కర్ సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. సుమారు 1100 స్క్రీన్లలో ఇండియాలో రిలీజ్ చేసినట్లు సమాచారం. అయితే రెమ్యునరేషన్లు, ప్రమోషన్ తోపాటు ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ సినిమా కోసం సాలిడ్ గానే ఖర్చు పెట్టినట్లు వినికిడి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తవ్వాలంటే రూ.70 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను లక్కీ భాస్కర్ మూవీ రాబట్టాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఎంతటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.