Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఆఫర్ కాదన్న రియల్ ఏజెంట్.. వారెవా..!

ఎవరైనా సరే తమ వ్యక్తిగత పేరు ప్రతిష్ట కోసమే ఎక్కువ పనిచేస్తారు.. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 1:30 AM GMT
బిగ్ బాస్ ఆఫర్ కాదన్న రియల్ ఏజెంట్.. వారెవా..!
X

ఎవరైనా సరే తమ వ్యక్తిగత పేరు ప్రతిష్ట కోసమే ఎక్కువ పనిచేస్తారు.. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. ఒక్కసారి అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం ఎంచక్కా వాడేసుకుంటారు. కానీ అలా తన స్వలాభం కోసం తన పాపులారిటీ కోసం అలా చేయనని అంటున్నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ సెక్యూరిటీ ఆఫీసర్ లకీ బిష్త్. అతను మాజీ స్నిపర్ గా చేయడమే కాకుండా RAW ఏజెంట్ గా కూడా పనిచేశారు.

ఐతే పీఎం సెక్యూరిటీ ఆఫీసర్ అనగానే సోషల్ మీడియాలో అతనికి సూపర్ పాపులారిటీ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ హిందీ టీం లక్కీ బిష్త్ కి షోలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. ఐతే ఆ ఆఫీసర్ మాత్రం ఆ ఛాన్స్ ని తిప్పికొట్టారు. బిగ్ బాస్ సీజన్ 18 హిందీ వెర్షన్ ఈమధ్యనే మొదలవగా అందులో ఒక కంటెస్టెంట్ గా లక్కీ బిష్త్ ని తీసుకోవాలని అనుకున్నారు.

కానీ లక్కీ మాత్రం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఒక రా ఏజెంట్.. తమ జీవితాలకు సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలి. తమ గురించి పూర్తి వివరాలు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి తమ పర్సనల్ లైఫ్ విషయాలను బయట పెట్టడం కుదరదని ఆ కారణాల వల్లే బిగ్ బాస్ కి వెళ్లడం కుదరదని చెప్పారు లక్కీ బిష్త్.

వచ్చిన ఛాన్స్ ని వాడుకోవాలని అందరు అనుకుంటారు కానీ ఒక రా ఏజెంట్ గా తన స్వలాభం కన్నా దేశం తనకు ఇంపార్టెంట్ అనుకున్నారు లక్కీ బిష్త్. అందుకే లక్కీ బిష్త్ జీవిత చరిత్ర ను రా హిట్ మ్యాన్ ది రియల్ స్టోరీ ఆఫ్ ఏజెంట్ లిమా అనే పేరుతో మాజీ జర్నలిస్ట్ ఎస్ హుస్సేన్ జైదీ రాశారు. 16 ఏళ్లలోనే సైన్యం లో చేరిన లక్కీ జీవిత కథను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

బిగ్ బాస్ లో అతను వెళ్తానంటే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే వాళ్లు కానీ తానొక రా ఏజెంట్ అయ్యుండి అలాంటి షోలో పాల్గొంటే కచ్చితంగా సమస్య ఎదురవుతుందని ఆలోచించి ఆ అవకాశాన్ని వదులుకున్నారు లక్కీ బిష్త్. ఈ విషయాలన్నీ బయటకు రావడంతో ఆయన గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో అంతా చర్చించుకుంటున్నారు.