Begin typing your search above and press return to search.

80 కాలం బ్యాంక్ ఎంప్లాయ్ భాస్క‌ర్ ఇలా!

పుల్ హ్యాండ్స్ చుక్క‌ల డిజైన్ ష‌ర్ట్..బ్యాగీ ప్యాంటు లో దుల్క‌ర్ లుక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ లో పాత కాలం వంద రూపాయ‌ల క‌రెన్సీ నోట్ల క‌ట్ట‌లు..మ‌ధ్య‌లో బ్యాంక్ ఎంప్లాయ్ భాస్క‌ర్ లుక్ ఆకట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 3:41 PM
80 కాలం బ్యాంక్ ఎంప్లాయ్ భాస్క‌ర్ ఇలా!
X

'సీతార‌మం'తో మ‌ల‌యాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్ గ్రాండ్ లాంచింగ్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే హీరోగా దుల్క‌ర్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. మ‌హాన‌టితోనే ఎంట్రీ ఇచ్చినా సీతారామం మాత్రం దుల్క‌ర్ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడా స‌క్సెస్ ని కంటున్యూ చేస్తూ వ‌రుస‌గా 'ల‌క్కీ భాస్క‌ర్' గా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ల‌క్కీ భాస్క‌ర్ నుంచి దుల్క‌ర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అయింది.

మమ్ముట్టి తనయుడిగా మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'లక్కీ భాస్కర్' నుంచి ఫస్ట్ లుక్ లాంఛ్ అయ్యింది. లుక్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. 80ల కాలం నాటి బొంబాయి బ్యాక్ డ్రాప్ తో రూపొందు తోన్న ఈసినిమాలో ఓ బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే తాజా లుక్ తో ఆక‌ట్టుకుంటున్నాడు.

పాత‌కాలం హీరో గెట‌ప్ లో దుల్కార్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అత‌డి హెయిర్ స్టైల్..క‌ళ్ల‌కి పాత కాలం అద్దాలు ధ‌రించాడు. పుల్ హ్యాండ్స్ చుక్క‌ల డిజైన్ ష‌ర్ట్..బ్యాగీ ప్యాంటు లో దుల్క‌ర్ లుక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ లో పాత కాలం వంద రూపాయ‌ల క‌రెన్సీ నోట్ల క‌ట్ట‌లు..మ‌ధ్య‌లో బ్యాంక్ ఎంప్లాయ్ భాస్క‌ర్ లుక్ ఆకట్టుకుంటుంది. పిక్ లో వెంకీ అట్లూరి మార్క్ డిజైన్స్ క‌నిపిస్తున్నాయి. ధ‌నుష్ తో వెంకీ తెర‌కెక్కించిన గ‌త సినిమా సార్ లో కూడా ధ‌నుష్ ని కొత్త‌గా చూపించాడు.

మ‌రోసారి 80స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలోనూ హీరోని త‌న‌శైలికి ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ ఫోస్ట‌ర్ వైర‌ల్ గా మారింది. ఇందులో దుల్క‌ర్ కి జోడీగా మీనాక్షి చౌదరి న‌టిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ తో పాటు.. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.