Begin typing your search above and press return to search.

లక్కీ భాస్కర్.. కాలరెత్తి తిరగరా!

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో మార్కెట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రమంగా పెంచుకుంటున్న విషయం తెలసిందే.

By:  Tupaki Desk   |   28 July 2024 11:23 AM GMT
లక్కీ భాస్కర్.. కాలరెత్తి తిరగరా!
X

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో మార్కెట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రమంగా పెంచుకుంటున్న విషయం తెలసిందే. కథల ఎంపికలో వైవిధ్యంగా అడుగులు వేస్తున్న ఆయన.. వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వరుస హిట్లు అందుకుంటున్నారు. మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో క్యామియో రోల్ లో కనిపించారు. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని బ్యాంక్ క్యాషియర్ రోల్ లో కనిపించనున్నారు దుల్కర్ సల్మాన్. ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది.

సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుందీ మూవీ. అయితే ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫస్ట్ సింగిల్ శ్రీమతిగారు.. సాంగ్ మెలోడీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. భార్యను భర్త బుజ్జిగించేలా ఉన్న ఈ మెలోడియస్ సాంగ్ అదిరిపోయింది. అయితే ఆదివారం దుల్కర్ బర్త్ డే కావడంతో లక్కీ భాస్కర్ మేకర్స్ సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా అంటూ సాగే టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు. మంచి జోష్ తో ఉంటూ మూవీపై అంచనాలను పెంచుతుందని అంటున్నారు. అయితే ఈ సాంగ్ తో రామజోగయ్య శాస్త్రి మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. హీరో రోల్ కరెక్ట్ గా అర్థమయ్యేలా చెబుతూ.. మ్యూజిక్ లవర్స్ లో స్ఫూర్తి నింపేలా లిరిక్స్ రాశారు. సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాహిత్యాన్ని అందించారు.

లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్‌ తన వాయిస్ తో అదరగొట్టారు. 1980ల నాటి ఇండి-రాక్ వైబ్ ను తన మ్యూజిక్ తో జీవీ ప్రకాష్ కుమార్ తీసుకొచ్చారు. ప్రస్తుతం జెనరేషన్ కు తగ్గట్లు కంపోజ్ చేశారు. 1980-90 టైమ్ కు చెందిన ఒక క్యాషియర్ కథను సినిమా రూపంలో తీసుకొస్తున్నారు వెంకీ అట్లూరి. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ దుల్కర్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.