Begin typing your search above and press return to search.

లక్కీ భాస్కర్ అలెర్ట్.. ప్లాన్ మారింది!

ఇదిలా ఉంటే ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ నుంచి టీజర్ తో పాటు ఒక పాటని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 12:55 PM GMT
లక్కీ భాస్కర్ అలెర్ట్.. ప్లాన్ మారింది!
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ నుంచి టీజర్ తో పాటు ఒక పాటని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ రెండింటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.


ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగిగా ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఉండబోతోందని అర్ధమవుతోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మూవీ జోనర్, టోన్ కి తగ్గట్లుగానే జీవీ ఈ సినిమాకి సంగీతం అందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా చిత్రం యూనిట్ లక్కీ భాస్కర్ రిలీజ్ పై ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సినిమాని అక్టోబర్ 31కి వాయిదా వేసినట్లు తెలిపారు. లక్కీ భాస్కర్ సినిమా అవుట్ ఫుట్ పైన టెక్నీకల్ టీమ్ చాలా శ్రద్ధ పెట్టి వర్క్ చేస్తున్నారు. 80s, 90s వాతావరణం రిప్రజెంట్ చేసే విధంగా సెట్స్ డిజైన్ చేశారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. మేము ఈ సినిమా అవుట్ ఫుట్, డబ్బింగ్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడదలుచుకోలేదు.

ప్రతి భాషలో కూడా నేటివ్ లాంగ్వేజ్ సినిమా చూసిన అనుభూతి కలిగించాలనే ఉద్దేశ్యంతో వర్క్ చేస్తున్నాము. మేము అనుకున్న క్వాలిటీలో మూవీ కంప్లీట్ కావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే రిలీజ్ డేట్ ని అక్టోబర్ 31కి వాయిదా వేయడం జరిగింది అని చిత్ర యూనిట్ ప్రకటనలో పేర్కొంది. అయితే సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాతో పోటీ పడితే కచ్చితంగా లక్కీ భాస్కర్ సినిమాకి ఆశించిన స్థాయిలో స్పందన రాదని చిత్ర యూనిట్ భావించి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే దీపావళి కానుకగా అక్టోబర్ 31కి లక్కీ భాస్కర్ చిత్రాన్ని వాయిదా వేసి ఉంటారని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీపావళికి విశ్వక్ షేక్ మెకానిక్ రాకీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. దానికి పోటీగా ఇప్పుడు మెకానిక్ రాకీ రాబోతోందని అర్ధమవుతోంది.