Begin typing your search above and press return to search.

లక్కీ భాస్కర్ ఆ డేట్ పై కన్నేశాడా..?

సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని ఉంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 5:27 AM GMT
లక్కీ భాస్కర్ ఆ డేట్ పై కన్నేశాడా..?
X

తెలుగులో మీడియం రేంజ్ హీరోలకు ఈక్వల్ క్రేజ్ తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా సొంత భాషలో సత్తా చాటుతున్న దుల్కర్ తెలుగులో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్నాడు. మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో అదరగొట్టిన దుల్కర్ సీతారామం సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ఈ రెండు సినిమాలతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే దుల్కర్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 1980 కాలం నాటి కథతో వస్తుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మెనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు.

సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని ఉంది. ఐతే సెప్టెంబర్ 27న ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG వస్తుందని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుండగా సెప్టెంబర్ 27 కి OG రిలీజ్ కష్టమే అంటున్నారు. ఐతే OG రావడం లేదని తెలుసుకున్న దేవర టీం అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి తమ సినిమాను ప్రీ పోన్ చేసుకున్నారు.

అక్టోబర్ 10న రాం చరణ్ గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న కారణంగా దేవర ఇలా ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అని నిన్న మొన్నటిదాకా గట్టిగా చెప్పగా ఇప్పుడు అనుకున్న డేట్ కి రావడం కష్టమని అంటున్నారు. అందుకే లక్కీ భాస్కర్ సినిమాను ఆగష్టు 15కి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. పుష్ప 2 వస్తే లక్కీ భాస్కర్ తప్పుకుంటాడా లేదా పుష్ప రాజ్ తో పోటీ పడతాడా అన్నది చూడాలి. లక్కీ భాస్కర్ సినిమా టీజర్ ఐతే ఇంప్రెస్ చేయగా మరో సరికొత్త పాత్రతో దుల్కర్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించడానికి వస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాను కేవలం తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.