Begin typing your search above and press return to search.

దుల్కర్ లక్కీ భాస్కర్ కు పోటీగా ఆ హీరో!

ఇక రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు దుల్కర్ సల్మాన్.

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:39 AM GMT
దుల్కర్ లక్కీ భాస్కర్ కు పోటీగా ఆ హీరో!
X

స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన యాక్టింగ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు కథానాయకుడు దుల్కర్ సల్మాన్. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. లెఫ్టెనెంట్ రామ్ గా గుర్తుండిపోయారు. ఆ తర్వాత సీతారామం మూవీతో తెలుగు కుర్రాడిగా మారిపోయారు! అప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతోంది.

ఇక రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. సీతారామం తర్వాత దుల్కర్.. తెలుగులో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు.

సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే అదే డేట్ కు షెడ్యూల్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు కాస్త క్లారిటీ వచ్చింది. దీంతో లక్కీ భాస్కర్ సోలోగా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు పోటీగా మరో చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ యాక్ట్ చేస్తున్న అమరన్ కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో విడుదల అవ్వనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ ఆర్మీ రాజ్‌ పుత్ రెజిమెంట్‌ ఆఫీసర్‌ గా పనిచేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. తీవ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చర్యలకు గాను మరణానంతరం ప్రతిష్టాత్మక అశోక చక్ర లభించింది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న అమరన్ సినిమాను కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కశ్మీర్ సహా ఇండియాలోని అందమైన లొకేషన్స్‌ లో ఈ సినిమాను షూట్ చేశారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.