Begin typing your search above and press return to search.

ఆ బ‌డా నిర్మాణ సంస్థ‌కు 150 కోట్ల లీగల్ నోటీసా?

అయితే టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం కాపీ క్యాట్ అనే కాక డే బై డే ఎక్కువ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీస్తుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 6:53 AM GMT
ఆ బ‌డా నిర్మాణ సంస్థ‌కు 150 కోట్ల లీగల్ నోటీసా?
X

త‌ల అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `విడ‌ముయార్చి` సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. `గుడ్ బ్యాడ్ అగ్లీ` వాయిదా ప‌డ‌టంతో? `విడ‌ముయార్చి`పై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతు న్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ సినిమా హాలీవుడ్ మూవీ `బ్రేక్‌డౌన్‌`కి రీమేక్ అనే ప్ర‌చారం కూడా ఉంది. కానీ దాని గురించి పెద్ద‌గా చ‌ర్చ‌కు రాలేదు. దీనిపై మేక‌ర్స్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

అయితే టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం కాపీ క్యాట్ అనే కాక డే బై డే ఎక్కువ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ బజ్ ప్రకారం `విడాముయార్చి` సినిమా `బ్రేక్‌డౌన్` రీమేక్ అని, కానీ రైట్స్ తీసుకోలేద‌న్న‌ వార్త వెలుగులోకి వ‌స్తోంది. తాజాగా ఇది నిజం అయ్యేలా ఆల‌స్యంగా మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. టీజ‌ర్ రిలీజ్ అనంత‌రం `బ్రేక్ డౌన్` కంపెనీ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ 15 మిలియన్ డాలర్లు అంటే? భారతీయ రూపాయలలో దాదాపు 150 కోట్లు డిమాండ్ చేస్తూ లైకా ప్రొడక్షన్స్‌కి నోటీసు పంపింది.

దీంతో లైకా చిక్కుల్లో ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా రైట్స్ తీసుకోకుండా చేస్తే గ‌నుక భారీ ఎత్తున మూల్యం చెల్లించ‌కోక త‌ప్ప‌దు. ఆ ప్ర‌భావం రిలీజ్ పై కూడా ప‌డుతుంది. చ‌ట్ట ప‌రంగా చిక్కులు త‌ప్ప‌వు. సినిమా రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంటుంది. విష‌యం నిజ‌మైతే లైకా కి ఇదో కొత్త త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఆ సంస్థ న‌ష్టాల్లో ఉంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా? అవి ఆశించిన ఫ‌లితాలు సాధించడం లేదు.

ఒక్కో సినిమాకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. మేక‌ర్ల మీద , హీరోల మీద న‌మ్మ‌కంతో రాజీ లేకుండా ఆ సంస్థ సినిమాలు పని చేస్తుంది. లైకా గ‌త సినిమా `వెట్టేయాన్` కోసం భారీగా వెచ్చించింది. కానీ అంచ‌నాలు అందుకోవ‌డంలో ఆ సినిమా విఫ‌ల‌మైంది. అంత‌కు ముందు రిలీజ్ అయిన `ఇండియ‌న్ -2` కూడా నిరాశ‌నే మిగిల్చింది. తాజాగా న్యూ వెంచ‌ర్ విష‌యంలో 150 కోట్ల నోటీస్ లైకాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంశాలే.