Begin typing your search above and press return to search.

భారతీయుడు 2.. అసలు సమస్య ముందుంది!

దానికి శంకర్ ఒకే చెప్పే కథని మరింత పెద్దగా చెప్పాలని అనవసరమైన సన్నివేశాలని కథలో జొప్పించారు.

By:  Tupaki Desk   |   17 July 2024 11:23 AM GMT
భారతీయుడు 2.. అసలు సమస్య ముందుంది!
X

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కథ బాగున్నా కూడా కథనం మాత్రం అస్సలు మెప్పించలేదనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. మొదటి రోజు మొదటి ఆట నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ స్టార్ట్ అయ్యింది. బడ్జెట్ పెరిగిపోయిందని రెండు భాగాలుగా ఈ చిత్రం తీయాలని నిర్మాతలు భావించారు. దానికి శంకర్ ఒకే చెప్పే కథని మరింత పెద్దగా చెప్పాలని అనవసరమైన సన్నివేశాలని కథలో జొప్పించారు.

ఇప్పుడు ఈ ప్రయోగమే సినిమాని కంప్లీట్ గా దెబ్బతీసింది. డైరెక్ట్ గా ఒక్క పార్ట్ గా కథని చెప్పి ఉన్న సరిపోయేదనే మాట వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే మూవీ భారీ నష్టాలని మిగిల్చేలా ఉందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఏ విధంగా కూడా మూవీ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ కి లాల్ సలామ్ తో పెద్ద డిజాస్టర్ వచ్చింది.

ఇప్పుడు భారతీయుడు 2 రూపంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది. ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ని ముందే అమ్మేశారు. అయితే సినిమాకి కలెక్షన్స్ రాకపోవడంతో అసలు సమస్య ఎదురుగా రాబోతోంది. డిస్టిబ్యూటర్స్, బయ్యర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైందంట. ఈ సినిమా వలన వచ్చిన నష్టాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట. అయితే నెక్స్ట్ అజిత్ కుమార్ తో విడామయార్చి సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భారతీయుడు 2తో నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ కి విడా మయార్చి థీయాట్రికల్ రైట్స్ ని ఇచ్చి సరి చేయాలనే ఆలోచన చేస్తున్నారంట.

లేదంటే భారతీయుడు 3 మూవీ రైట్స్ ని ఆఫర్ చేస్తున్నారంట. ఈ సినిమాని శంకర్ ప్రీక్వెల్ గా చేస్తున్నారు. సేనాపతి తండ్రి వీర శేఖర్ కథని చెప్పబోతున్నరంట. కచ్చితంగా ఈ సినిమా అయితే అందరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారంట. కొత్త కథ కావడంతో ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారని భావిస్తున్నారు. భారతీయుడు 2 డిజాస్టర్ ఇంపాక్ట్ భారతీయుడు 3 మీద ఉంటుంది. బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేదు.

ఈ నేపథ్యంలో శంకర్ గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత భారతీయుడు 3 మూవీ రిలీజ్ చేస్తే కొంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నారంట. ఒక వేళ డిస్టిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ పట్ల ఆసక్తి చూపించకపోతే ఒటీటీలో రిలీజ్ చేసే ఆలోచన కూడా నిర్మాత ఆలోచిస్తున్నారంట. మరి ఫైనల్ గా భారతీయుడు 3 రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి.