Begin typing your search above and press return to search.

మా నాన్న సూపర్‌ హీరో టీజర్.. కొత్తగా ఉందే..

ఇక ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 1:08 PM GMT
మా నాన్న సూపర్‌ హీరో టీజర్.. కొత్తగా ఉందే..
X

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదళపతి సుధీర్ బాబు, మా నాన్న సూపర్‌హీరో అనే డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కనకరా దర్శకుడు కాగా, వి సెల్యులోయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బాలుసు, సిఎఎం ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.


తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లు మొదలవగా, నేచురల్ స్టార్ నాని టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. టీజర్‌లో సుధీర్ బాబు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునే విధంగా చూపించారు. టీజర్‌లో సుధీర్ బాబు తన తండ్రిగా ఇద్దరు కనిఊస్తున్నారు. ఒకరు సాయాజీ షిండే, మరొకరు సాయి చంద్‌. అయితే, సాయాజీ షిండే పాత్రలో తండ్రితో విభేదాలు కనిపిస్తే, సాయి చంద్ పాత్రలో ఆత్మీయమైన బంధం కనిపిస్తుంది.

సినిమాలో ఇదే అసలు ట్విస్ట్ అని అర్ధమవుతుంది. చివర్లో సుధీర్ బాబు తండ్రి, కొడుకు క్యాన్సర్‌ ఉన్నట్లు నటిస్తూ ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడు. దానికి సుధీర్ బాబు సానుకూలంగా స్పందించడం టీజర్‌ను ఆసక్తికరంగా ముగించింది. టీజర్‌లో సుధీర్ బాబు తన తండ్రిపై ఉన్న ప్రేమను చాలా హృద్యంగా చూపించారు. సాయాజీ షిండే, సాయి చంద్ తమ పాత్రల్లో భిన్నంగా కనిపించారు.

రాజు సుందరం పాత్ర కూడా టీజర్ ద్వారా పరిచయమవుతుంది. టీజర్ చూసినప్పుడు సుధీర్ బాబు తన తండ్రులతో ఉన్న సంబంధం ఎలా ఉంటుందో తెలియకపోయినా, కథపై ఆసక్తి కలిగేలా ఉంటుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కనకరా ప్రధాన పాత్రలను ఆకట్టుకునేలా రాశారు. సమీర్ కల్యాణి అందించిన విజువల్స్ చాలా అందంగా కనిపిస్తాయి.

జే కృష్ణ అందించిన సంగీతం కథను హృద్యంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నిర్మాణ విలువలు కూడా తగినంత ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు అర్ణా, సాయాజీ షిండే, సాయి చంద్, రజు సుందరం, శశాంక్, ఆమని, అణ్ణీ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు సుధీర్ బాబు ఎన్నో వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్ తో ఎట్రాక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.