మామా మశ్చీంద్ర.. ఇది ఊహించలేదు
దీంతో ఉన్న థియేటర్స్ లో కూడా ఏదో నామమాత్రంగా ఆడించడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపొయింది.
By: Tupaki Desk | 9 Oct 2023 3:55 AM GMTసుదీర్ బాబు మూడు విభిన్నమైన పాత్రలలో నటించిన చిత్రం మామా మశ్చీంద్ర. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఎలాంటి బజ్ లేకుండానే థియేటర్స్ లోకి ఈ మూవీ వచ్చింది. దీంతో పూర్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. పోనీ మౌత్ టాక్ అయిన బాగుందా అంటే అది కూడా లేదు. దీంతో రెండో రోజుకె రిలీజ్ అయిన థియేటర్స్ సగానికి తగ్గించేశారు.
ఈ సినిమా స్థానంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన మ్యాడ్ మూవీని వేయడం స్టార్ట్ చేశారు. ఇక ఆదివారానికి అయితే మామా మశ్చీంద్ర మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. దీంతో ఉన్న థియేటర్స్ లో కూడా ఏదో నామమాత్రంగా ఆడించడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపొయింది. సుదీర్ బాబు కెరియర్ లో జీరో షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా ఈ మూవీ నిలిచిపోనుంది.
నటుడిగా ఉంటూ రైటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ కి దర్శకుడిగా ఈ చిత్రం బ్యాడ్ ఎంట్రీ అని చెప్పాలి. సుదీర్ బాబు కష్టపడి, ఇష్టపడి మరీ మూడు పాత్రలలో వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేసిన కంటెంట్ లో దమ్ము లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేదని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని ఒటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ డేట్ ఎనౌన్స్ చేసింది. కేవలం రెండు వారల గ్యాప్ లో మూవీని ఒటీటీలోకి వదిలేస్తున్నారు అంటేనే ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అయ్యిందనేది అర్ధం చేసుకోవచ్చు.
సుదీర్ బాబు తన ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ ని మామా మశ్చీంద్ర మూవీతో ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడని అర్ధమవుతోంది. మరి అతని టాలెంట్ కి బ్రేక్ ఇచ్చే స్థాయిలో మూవీ ఎప్పుడు పడుతుందనేది వెయిట్ చేయాలి. బాలీవుడ్ వాళ్ళు సుదీర్ బాబులో గుర్తించిన టాలెంట్ ని తెలుగు దర్శకులు ఎందుకు గుర్తించి మంచి మూవీ చేయలేకపోతున్నారో అనేది అర్ధం కాని ప్రశ్నగా ఉంది.