మామా మశ్చీంద్ర ట్రైలర్.. థ్రిల్లింగ్ ట్విస్ట్
ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకోకు. ఒకవేళ పంచుకోవాల్సి అనిపించే డైరీ రాయి. ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు
By: Tupaki Desk | 27 Sep 2023 10:33 AM GMTటాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న కొత్త సినిమా మామా మశ్చీంద్ర. పరశురామ్(మామ పాత్ర), దుర్గా(భారీకాయుడుగా), డీజే(స్టైలిష్‌గా) అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచి క్యూరియాసిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్న మూవీటీమ్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకోకు. ఒకవేళ పంచుకోవాల్సి అనిపించే డైరీ రాయి. ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు. బ్రహ్మండంగా వర్కౌట్ అవుతది. ఒకవేళ ఎవరూ చదవకూడదని అనుకుంటే ఒకసారి రాసి కాల్చి పడేయ్. అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైందీ ట్రైలర్.
ఆ తర్వాత తమ నాన్న పోలీకలున్న దుర్గా, డీజేను.. ఈషా రెబ్బా, మృణాళిని రవి ప్రేమించడం, అది తెలుసుకున్న హీరోయిన్స్ తండ్రి పరశురామ్(సుధీర్ బాబు).. గతం నన్ను వెతుక్కుంటూ వస్తోంది, కానీ దానికి తెలీదు దానీ కోసం నేను ఎదురుచూస్తున్నానని అంటూ తన రూపం పోలీ ఉన్న సొంత మేనళ్లులనే చంపాలనుకోవడం వంటీ సీన్స్‌ను చూపించారు. దీని బట్టి పరశురామ్‌కు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోహీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఉంది. విజువల్స్ కూడా ఇంటెన్స్గానే కనిపిస్తున్నాయి. పీజీ విందా మ్యూజిక్ కూడా బాగుంది. చైతన్ భరద్వాజ్ కూడా ఇంట్రెస్టింగ్ స్కోర్‌ను అందించాడు. డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
మరి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన పరశురామ్.. తన చెల్లి కొడుకులను ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు గతంలో తన చెల్లి కుటుంబంతో వైరం ఎందుకు ఏర్పడింది? తెలుసుకోవాలంటే సినిమా రిలీజయ్యాక తెరపై చూడాల్సిందే.
సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి రాజీవ్ - కళ పి.జి.విందా - ఛాయాగ్రహణం, చైతన్ భరద్వాజ్ - సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మ్యాడ్, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ కూడా అక్టోబర్ 6నే విడుదల కానున్నాయి.