మ్యాడ్ స్క్వేర్.. మూడు రోజుల లెక్కలు ఇలా!
యంగ్ హీరోస్ సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 7:25 AMయంగ్ హీరోస్ సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీక్వెల్ కు కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
అనౌన్స్మెంట్ నుంచే మ్యాడ్ స్క్వేర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత పోస్టర్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అంచనాలను రెట్టింపయ్యాయి. దీంతో మూవీ కోసం అంతా ఎదురుచూశారు. అయితే సినిమాకు కొన్ని మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ థియేటర్లలో ప్రేక్షకులు మాత్రం పగలబడి నవ్వుతున్నారనే చెప్పాలి.
అదే సమయంలో మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తోంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది. ఓవర్సీస్ లో మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటి వరకు మూవీ.. అక్కడ 700 K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, ఏపీ- తెలంగాణలో మ్యాడ్ స్క్వేర్ మొత్తం 3 రోజులకు గాను రూ. 14.91 కోట్లు సాధించింది. మూడో రోజు రూ.5.36 కోట్లు రాబట్టింది. మూడో రోజు అతిపెద్ద షేర్ రోజు కావడం నిజంగా గ్రేట్ అయిన విషయమే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మ్యాడ్ స్క్వేర్ వసూళ్లు వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాం - రూ. 2.14 కోట్లు
సీడెడ్ - రూ. 0.83 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 0.83 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 0.51 కోట్లు
వెస్ట్ గోదావరి - రూ. 0.21 కోట్లు
కృష్ణ - రూ. 0.35 కోట్లు
గుంటూరు - రూ. 0.33 కోట్లు
నెల్లూరు - రూ. 0.16 కోట్లు
3వ రోజు మొత్తం - రూ. 5.36 కోట్లు
మొత్తం మూడు రోజుల కలెక్షన్లు ఇలా!
నైజాం - రూ. 6.67 కోట్లు
సీడెడ్ - రూ. 2.17 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.95 కోట్లు
తూర్పు గోదావరి- రూ. 1.16 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ. 0.55 కోట్లు
కృష్ణ - రూ. 0.85 కోట్లు
గుంటూరు - రూ. 1.09 కోట్లు
నెల్లూరు - రూ. 0.47 కోట్లు
మొత్తం (3 రోజులు) - రూ. 14.91 కోట్లు
అయితే నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను మ్యాడ్ స్క్వేర్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో కంప్లీట్ చేసుకోనున్నట్లు అర్థమవుతోంది. మొత్తానికి మూవీ లాభాల బాటలో పయనించనుందని స్పష్టంగా కనిపిస్తోంది. మరి మ్యాడ్ స్క్వేర్ ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో.. ఎలాంటి లాభాలు సాధిస్తుందో వేచి చూడాలి.