Begin typing your search above and press return to search.

'మ్యాడ్ స్క్వేర్' సెన్సార్‌ రిపోర్ట్‌

మార్చి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 March 2025 11:33 AM IST
మ్యాడ్ స్క్వేర్ సెన్సార్‌ రిపోర్ట్‌
X

సూపర్‌ హిట్ అయిన 'మ్యాడ్‌' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమా విడుదలకు సిద్ధం అయింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. మ్యాడ్‌ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ సినిమా పెద్ద సినిమాగా రిలీజ్‌కి రెడీ అవుతుంది. మొదటి పార్ట్‌తో పోల్చితే బడ్జెట్‌తో పాటు అన్ని విషయాల్లోనూ ఎక్కువగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. వారే ముగ్గురు హీరోలు ఈ సీక్వెల్‌లో కంటిన్యూ కావడంతో పాటు పలు కామన్‌ పాయింట్స్ ఉన్నాయి.

మార్చి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు పెంచే విధంగా సెన్సార్‌ టాక్‌తో పాటు, రన్‌ టైం ఉంది. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అనే టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమా మరీ లెంగ్తీగా లేకుండా సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా ఉండే విధంగా కేవలం 2 గంటల 7 నిమిషాల రన్‌ టైం మాత్రమే ఉంచారని తెలుస్తోంది. ఆ టైమ్‌లోనే టైటిల్‌ కార్డ్స్‌ సైతం పడనున్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రెండున్నర గంటలు, అంతకు మించి ఉండటంతో బోరింగ్‌గా అనిపిస్తున్నాయి. విడుదల తర్వాత రన్‌ టైం తగ్గిస్తున్న వారు ఉన్నారు.

మ్యాడ్ స్క్వేర్ సినిమా మేకర్స్ ముందుగానే మరీ ఎక్కువ రన్‌ టైం లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్‌ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య రెస్పాన్స్‌ దక్కడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లు హీరోలుగా నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు.

సంగీత్‌ శోభన్ కామెడీతో పాటు ఇతర ఇద్దరు హీరోలు మ్యాడ్ స్క్వేర్‌తో మరోసారి ఆకట్టుకోవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో మ్యాడ్ వంటి యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి మంచి స్పందన ఉంటుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా కచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు హీరోలకు ఈ సినిమా మరోసారి కీలకంగా మారింది. ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటే ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.