Begin typing your search above and press return to search.

మ్యాడ్ స్క్వేర్‌.. ఇది బాక్సాఫీస్ కు సరిపోయే టైమింగ్!

ఈ సినిమా వేసవి సెలవుల్లో విడుదల కావడం, ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు రెడీగా ఉండడం ప్లస్ పాయింట్ అవుతోంది.

By:  Tupaki Desk   |   18 March 2025 3:27 PM IST
మ్యాడ్ స్క్వేర్‌.. ఇది బాక్సాఫీస్ కు సరిపోయే టైమింగ్!
X

సరైన సమయం, మంచి కంటెంట్, ప్రేక్షకుల మూడ్ అన్నీ కలిసొస్తే.. కామెడీ ఎంటర్టైన్ సినిమాలు భారీ స్థాయిలో హిట్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా అలాంటి స్థితిలోనే ఉంది. 'మ్యాడ్' అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత, రెండో భాగమైన ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా వేసవి సెలవుల్లో విడుదల కావడం, ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు రెడీగా ఉండడం ప్లస్ పాయింట్ అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై హైప్ పెంచాయి. ముఖ్యంగా ‘లడ్డూ గాని పెళ్లి’ సాంగ్ ట్రెండింగ్‌లో నిలవడంతో, సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ కలిసి మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యారు. మొదటి పార్ట్‌ను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడంతో, మొదటి భాగం కంటే హై రేంజ్ కామెడి తో మరింత బలంగా చూపించబోతున్నట్లు సమాచారం.

సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే, ‘మ్యాడ్ స్క్వేర్’ 2 గంటల 7 నిమిషాల పాటు మాత్రమే ఉండబోతోంది. ఇది పూర్తిగా కామెడీ డ్రామాకి యాప్ట్ అయిన టైమ్. ఎక్కువసేపు సీట్లు అంటిపెట్టుకుని హాస్యాన్ని ఆస్వాదించాలనే ప్రేక్షకుల కోరికను దర్శకుడు అర్థం చేసుకొని, కేవలం 127 నిమిషాల్లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ట్రిమ్ చేశాడు. టైటిల్స్, వార్నింగ్స్‌తో కలిపి ఈ రన్‌టైమ్ ఫిక్స్ చేయడం, సినిమా గ్రిప్పింగ్‌గా సాగుతుందనే సంకేతాలను ఇస్తోంది.

ఈ సినిమా వేసవి సెలవుల్లో విడుదల కావడం మరో పెద్ద ప్లస్. వేసవిలో చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ‘మ్యాడ్’ మాదిరిగా ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా తక్కువ టికెట్ రేట్లలో విడుదలైతే, భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇది ఎలాంటి పోటీ లేకుండా విడుదల కావడం కూడా బెనిఫిట్ అవ్వొచ్చు. రాబిన్‌హుడ్ విడుదలతో ఒకే రోజున బాక్సాఫీస్‌కి దిగినా, రెండూ వేరే టార్గెట్ ఆడియెన్స్‌తో ఉండడం వల్ల పెద్దగా పోటీ అనిపించదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి, ‘మ్యాడ్ స్క్వేర్’ టైమింగ్ పరంగా చూసుకుంటే ఇది పూర్తి సక్సెస్ అయ్యే అన్ని సూచనలూ కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల టైమ్, తక్కువ రన్ టైమ్, హిట్ సినిమాకు సీక్వెల్ అన్న ప్లస్ పాయింట్లు కలవడంతో, ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పండుగ సృష్టించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా తొలి వారంలో భారీ కలెక్షన్లు సాధించొచ్చని అంచనా వేస్తున్నాయి. మరి ‘మ్యాడ్ స్క్వేర్’ తన అంచనాలను ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.