బాలీవుడ్ భామలపై కన్నేసిన మ్యాడ్ బాయ్స్
మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: Tupaki Desk | 22 March 2025 12:40 PM ISTమ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బ్లాక్ బస్టర్ మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్వ్కేర్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు.
మార్చి 28న మ్యాడ్ స్వ్కేర్ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం కలిసి సరదాగా ఓ చిట్ చాట్ నిర్వహించి సరదాగా మాట్లాడుకున్నారు. చిట్ చాట్ లో భాగంగా మ్యాడ్ మూవీలో నటించిన బాయ్స్ ను డైరెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగాడు.
ఇప్పుడు మీరంతా హీరోలైపోయారు కదా మీరు నెక్ట్స్ సినిమా చేయాలంటే ఏ హీరోయిన్ తో చేస్తారని డైరెక్టర్ అడిగాడు. దానికి రామ్ నితిన్ తనకు ఆలియా భట్ అంటే ఇష్టమని చెప్పగా లడ్డూ మామ కన్నీ కసూడితి పేరు చెప్పాడు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దీపికా పదుకొణె పేరుని చెప్పగా, సంగీత్ శోభన్ నాకు గుర్తు రావట్లేదన్నాడు. అంతమంది ఉన్నారా అని డైరెక్టర్ అనగానే వెంటనే సంగీత్, త్రిప్తి డిమ్రీ పేరు చెప్పేశాడు. నార్నే నితిన్ జాన్వీ కపూర్ పేరు చెప్పాడు.
అయితే ఈ పేర్లన్నీ గమనిస్తే ఇందులో ఏ హీరో సౌత్ హీరోయిన్ పేరు చెప్పలేదు. దానికి కారణమేంటో కూడా సంగీత్ శోభన్ అదే చిట్‌చాట్‌లో తెలిపాడు. ఒకవేళ సౌత్ హీరోయిన్ల పేర్లు చెప్పామంటే వెంటనే అవి థంబ్‌నైల్స్ అయిపోతాయని అందుకే అందరూ తెలివిగా నార్త్ హీరోయిన్ల పేర్లు చెప్పామని సరదాగా చెప్పాడు.
దీంతో పాటూ మరో క్రేజీ ప్రశ్న కూడా డైరెక్టర్ ఆ బాయ్స్ ను అడిగాడు. జీవితం మొత్తం మీద మీకు ఒకే సినిమా చూసే ఆప్షన్ ఉంటే ఏ సినిమా చూస్తారని అడగ్గా దానికి సంగీత్ చంటబ్బాయి సినిమా అని చెప్పగా, రామ్ నితిన్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా పేరు, లడ్డు నువ్వే నువ్వే అని, నార్నే నితిన్ నాన్నకు ప్రేమతో సినిమా పేర్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మ్యాడ్ స్వ్కేర్ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో నమ్మకంగా ఉంది.