డబుల్ ఎంటర్టైన్మెంట్ తో మ్యాడ్ స్క్వేర్ టీజర్
ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ రిలీజైన 10 నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేంతగా అందులోని కంటెంట్ ఉంది.
By: Tupaki Desk | 25 Feb 2025 11:03 AM GMT2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లడ్డు గాని పెళ్లి, స్వాతి రెడ్డి సాంగ్స్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. దీంతో మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు బాగా పెరిగాయి.
ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ రిలీజైన 10 నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేంతగా అందులోని కంటెంట్ ఉంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాడ్ స్వ్కేర్ ఓ కొత్త స్టోరీలైన్ తో మరింత ఎంటర్టైనింగ్ గా రూపొందినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మ్యాడ్ లో నవ్వులు పూయించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు(లడ్డు) ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచడంలో టీజర్ చాలా బాగా సక్సెస్ అయింది. టీజర్ లోని ప్రతీ డైలాగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది.
టీజర్ అంత ఎలివేట్ అవడానికి భీమ్స్ సిసిరోలియో బీజీఎం కూడా ఓ కారణం. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ కెమెరా బాధ్యతలు తీసుకోగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించగా నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 29న రిలీజ్ కానున్న ఈ సినిమాతో ఆడియన్స్ కు అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని టీజర్ చూశాక క్లారిటీ వచ్చేసింది.