ట్రైలర్ టాక్: మ్యాడ్ స్వ్కేర్ .. నాన్ స్టాప్ నవ్వులే
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 26 March 2025 6:58 AM2023లో వచ్చిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు మ్యాడ్ కు సీక్వెల్ గా మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కింది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ పాసైన నలుగురు కుర్రాళ్లు గోవా వెళ్లి చేసే రచ్చ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటూ కడుపుబ్బా నవ్విస్తోంది.
మ్యాడ్ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా కథేమీ ఉండదని ఎప్పటినుంచో దర్శకనిర్మాతలు చెప్తూనే వస్తున్నారు. కేవలం రెండు గంటల పాటూ సినిమా చూసి నవ్వుకోడానికి మాత్రమే రండని ఆడియన్స్ కు చెప్పారు. మేకర్స్ చెప్పినట్టే మ్యాడ్ స్వ్కేర్ మూవీ నాన్ స్టాప్ రెండు గంటల నవ్వుల్ని పూయించడం ఖాయమని ట్రైలర్ ఋజువు చేసింది.
ట్రైలర్ లో నార్నే నితిన్, సంగీత్, రామ్ నితిన్, లడ్డూల కామెడీ టైమింగ్ తో పాటూ భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ అంతా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.