Begin typing your search above and press return to search.

మ్యాడ్ స్క్వేర్ ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..!

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మ్యాడ్ స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మార్చి 28న రిలీజై ప్రేక్షకులను మెప్పించింది.

By:  Tupaki Desk   |   3 April 2025 3:45 AM
మ్యాడ్ స్క్వేర్ ఈ ట్విస్ట్ ఊహించలేదుగా..!
X

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్ లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మ్యాడ్ స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మార్చి 28న రిలీజై ప్రేక్షకులను మెప్పించింది. మ్యాడ్ సినిమా రేంజ్ లో కథ కామెడీ లేకపోయినా సరే ఆడియన్స్ మ్యాడ్ స్క్వేర్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లను రాబడుతుంది.

ఐతే ఈ సినిమా సక్సెస్ అయినా కూడా మీడియా దీన్ని ప్రమోట్ చేయకుండా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుందని రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. వీకెండ్ తో పాటు ఉగాది, రంజాన్ కలిసి రావడంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ అదిరిపోయాయి. ఐతే వీక్ డేస్ లో కూడా అదే దూకుడు చూపిస్తుంది అనుకున్న సినిమా కాస్త బాక్సాఫీస్ దగ్గర డల్ అయ్యింది. అలా అని ఈ మ్యాడ్ స్క్వేర్ బాయ్స్ ఆడియన్స్ కి నచ్చలేదా అని కాదు.

ఈమధ్య దాదాపు సినిమాలన్నీ వీకెండ్ లోనే లాభాల్లోకి వచ్చేస్తున్నాయి. స్టార్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ సినిమాలే వీకెండ్ లో అదే శుక్ర, శని, ఆది లోగా 300 నుంచి 500 కోట్లు రాబట్టేస్తున్నాయి. ఎందుకంటే మొదటి వారాంతరం మాత్రమే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆ సినిమా చూసేయాలి అన్న ఆసక్తి ఉంటుంది. ఇక మండే తర్వాత కూడా కాన్ స్టంట్ గా వసూళ్లు రాబట్టిన సినిమానే సూపర్ హిట్ అనేస్తాం.

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే సినిమా కొన్న అందరికీ లాభాలు వచ్చేలా చేసింది. ఐతే వీక్ డేస్ లో కలెక్షన్స్ కాస్త నమందించాయన్నది ట్రేడ్ పండితుల టాక్. ఐతే సినిమాను థియేటర్ కి వెళ్లి చూసే ఆడియన్స్ సంఖ్య తగ్గుతూ ఓటీటీలో వస్తుందిగా అప్పుడు చూసేద్దాం లే అన్న ఆడియన్స్ ఎక్కువయ్యారు. అందుకే సినిమా మొదటి వారం నుంచి రెండో వారం వచ్చే సరికి జనాలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు.

ఒకప్పుడు సినిమాలంటే సిల్వర్ జూబిలీ దాకా ఆడేవి. ఐతే అప్పటి పరిస్థితులు వేరు అయితే వీకెండ్ వరకు మాత్రమే కొత్త సినిమా నెక్స్ట్ వీక్ మరో సినిమా అనే ఆడియన్స్ మైండ్ సెట్ కి తగినట్టుగానే మొదటి వారం లోనే మాక్సిమం కలెక్షన్స్ రాబట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.