మాదాపూర్ డ్రగ్స్ కేసు.. తప్పించుకు తిరుగున్న నవదీప్?
మాదాపూర్ డ్రగ్స్ కేసు, వైజాగ్ కి చెందిన రామ్ చన్ తో హీరో నవదీప్ సంబంధాలను పోలీసులు ఆరాలు తీసారని కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 20 Sep 2023 5:07 AM GMTఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పట్లో పలువురు టాలీవుడ్ అగ్ర తారలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు, యువహీరోల పేర్లు ఇందులో బయటపడ్డాయి. సిట్ దర్యాప్తు జరిగింది. కానీ ఆ తర్వాత ఆ కేసు వీగిపోయింది. అటుపై కొన్నేళ్లకు మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. సినీఫైనాన్సియర్స్ వెంకట్ - బాలాజీ- మురళి అరెస్టయ్యారు. వీరితో పాటు నైజీరియన్లు ఒక సినీనిర్మాత కూడా అరెస్టయ్యారు. టాలీవుడ్ పిల్లలు కొందరు సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ డ్రగ్స్ పార్టీల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అప్పట్లోనే వైజగ్ కి చెందిన రామ్ చన్ ని పోలీసులు అరెస్టు చేసారు.రామ్ చన్ తో టాలీవుడ్ యువహీరో నవదీప్ కి సంబంధాలు ఉన్నాయని, అతడి నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసాడని ఫిర్యాదు ఉంది. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ సాగుతోంది.
మాదాపూర్ డ్రగ్స్ కేసు, వైజాగ్ కి చెందిన రామ్ చన్ తో హీరో నవదీప్ సంబంధాలను పోలీసులు ఆరాలు తీసారని కథనాలొచ్చాయి. కానీ అతడితో తనకు సంబంధాలు లేవని కూడా నవదీప్ ప్రముఖ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే తనకు సంబంధం లేదని చెబుతున్నా అతడు పోలీసులను కలిసి ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అతడు ప్రస్తుతం తనను విచారించాలనుకుంటున్న పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. గత ఐదు రోజులుగా పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారని ప్రముఖ తెలుగు వార్తా చానెల్ కథనం వెలువరించింది.
ఓవైపు ఏ పాపం తనకు తెలియదని అంటున్నాడు. మరోవైపు చిక్కడు దొరకడు. కానీ అతడు ఇలా తప్పించుకోవడం తనకే సమస్యాత్మకంగా మారుతుందని సదరు చానెల్ కథనంలో విశ్లేషించారు. ఇటీవలే ఇదే చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తాను ఏ తప్పూ చేయలేదని నవదీప్ అన్నట్టు కూడా టీవీ చానెల్ వర్గాలు వెల్లడించాయి. ఇక తనని కలిసి విచారించేందుకు అధికారులు నవదీప్ ఇంటికి, మాదాపూర్ ఆఫీస్ కి వెళితే అక్కడ లేకుండా తప్పించుకు తిరుగుతున్నాడని కూడా సదరు చానెల్ కథనం పేర్కొంది.
పోలీసులు నోటీసులిచ్చేందుకు నవదీప్ ఇంటికి, అలాగే మాదాపూర్ లోని ఆఫీస్ కి వెళ్లారు. వైజాగ్ కి చెందిన రాంచన్ నుంచి అతడు డ్రగ్స్ కొనుగోలు చేసాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో అధికారులు ముందుకు వెళుతున్నారు. కానీ నవదీప్ చిక్కడం లేదని వారు చెబుతున్నారు.
ఇప్పటికే తనను అరెస్ట్ చేయకుండా ఒకసారి హైకోర్టు నుంచి అతడు స్టే తెచ్చుకున్నాడు. దీని గడువు 19 సెప్టెంబర్ తో ముగిసింది. ఇప్పుడు మళ్లీ పోలీసులు గాలింపు చేపట్టారు. ఐదురోజులుగా వెతుకుతున్నా అతడు చిక్కడు దొరకడు. కానీ నవదీప్ నుంచి డ్రగ్స్ పార్టీలు , డ్రగ్స్ రూట్ ని కనిపెట్టాలని పోలీసుల ప్రయత్నం చేస్తున్నట్టు సదరు కథనం పేర్కొంది.
ఇవాళ ఈ కేసు విషయమై హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం పోలీసులు తనని వెతుకుతున్న క్రమంలో మరోసారి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడానికి నవదీప్ ప్రయత్నిస్తున్నాడని కథనాలొస్తున్నాయి. అందుకే అతడు ఎవరికీ చిక్కకుండా తిరుగుతున్నాడని కూడా సదరు మీడియా చానెల్ కథనంలో వెల్లడించింది. నవదీప్ ఎలాంటి తప్పు చేయనప్పుడు పోలీసులకు సరైన రీతిలో సమాధానం ఇస్తే బావుండేదని కూడా సదరు చానెల్ అతడికి సూచించింది.