అమ్మాయితో సెట్ లోనే జానీ గొడవ..సెటిల్ చేసిన సుకుమార్!
అందుకే టార్చర్ చేసాడు. 'పుష్ప 2' షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి పనిచేస్తుంటే.. అక్కడికి జానీ మాస్టర్ వచ్చి గొడవ పడ్డారు. నానా రచ్చ చేశారు.
By: Tupaki Desk | 22 Sep 2024 5:43 AM GMTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో అతడిని వ్యతిరేకించే వారు కొంతమంది అయితే మద్దతిచ్చేవారు మరికొంత మంది. మద్దతిచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు సహా, జానీ మాస్టర్ తీరుపై నటి, బీజేపీ నేత మాధవిలత నిప్పులు చెరిగారు. 'నాగబాబు గారు ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు. ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. మీ దృష్టిలో జానీ మాస్టర్ మంచి వాడు కావొచ్చు. కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం అతడు మంచి వ్యక్తి కాదని అర్దమవుతుంది కదా.
అతడు చేసిన నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. అది తెలియదా మీకు? సాక్ష్యంగా నేను ఉన్నాను. ఇండస్ట్రీలో అతడికి చాలా మందితో పరిచయాలున్నాయి. జానీ ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆ అమ్మాయి 16 లేదా 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ సమయంలో జానీ మాయ మాటలు నమ్మి ఆరు నెలలు రిలేషన్ లో ఉంది. అతడి మాటలకు మోసపోయింది. తర్వాత నిజం తెలుసుకుని బయటకు వచ్చేసింది. స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెట్టింది. అప్పుడు అమ్మాయి టీనేజర్. ఇప్పుడిప్పుడే 22 సంవత్సరాలు. ఆమె ఇండిపెండెంట్ గా పనిచేయడం జానీకి మాస్టర్‌కి ఇష్టం లేదనుకుంటా.
అందుకే టార్చర్ చేసాడు. 'పుష్ప 2' షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి పనిచేస్తుంటే.. అక్కడికి జానీ మాస్టర్ వచ్చి గొడవ పడ్డారు. నానా రచ్చ చేశారు. ఆ సమయంలో సుకుమార్ గారే ఆ పంచాయితి పెట్టి ఆ గొడవను క్లియర్ చేశారు. ఆ సినిమా షూట్ లో అంత పెద్ద గొడవ జరిగింది. ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు. కాబట్టే అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఆ అమ్మాయికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ తరువాత విశ్వక్ సేన్ సినిమా సైట్ లో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఇవన్నీ తెలుసుకుని మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ కూడా చేశారు.
ఆ అమ్మాయికి వందల మెస్సెజ్ పంపిస్తారు. నువ్వంటే.. ఇష్టం.. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. నువ్వు లేకుంటే నేను బతకలేను' అంటూ షూటింగ్ ల దగ్గర ఆమెను జానీ మాస్టర్ ఎన్నోసార్లు అవమానించారు. ఇబ్బంది పెట్టారు. అంతే కాదు ఆమెను ఎన్నోసార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, చాటింగ్ , కాల్ రికార్డింగ్స్ ఆధారంగానే ఆ అమ్మాయి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. అందుకే పోలీసులు కూడా కేసు నమోదు చేసారు. 'నిజానిజాలు తెలుసుకోకుండా.. అమ్మాయిపై నిందాలు వేయడం సరికాదు.
తప్పు ఎవరూ చేసిన తప్పే. మీ విషయంలో మీరు స్నేహితుడే కావచ్చు. ఆప్తుడే కావచ్చు. కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం ఆ వ్యక్తి మాత్రం విలనే.. నిజానికి టాలెంట్ వేరు క్యారెక్టర్ వేరు కదా. ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు ఎవరు కూడా ఆమెను బలవంతం చేయకూడదు. నలుగురులో అవమానించడం, సినిమా అవకాశాలు రాకుండా చేయడం ఏ మాత్రం సరికాదు' అని మండిపడ్డారు మాధవి లత.