'మేడ్ ఇన్ హెవెన్' ముద్దుగుమ్ముల కన్నుల విందు
మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో సీజన్ 2 ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించినట్లుగా తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.
By: Tupaki Desk | 3 Aug 2023 7:06 AM GMTశోభితా ధూళిపాళ, మృణాల్ ఠాకూర్, రాధిక ఆప్టే, షిబానీ దండేకర్, కల్కి, సారా జేన్, నైనా నరీన్, షీనా ఖలీద్ ఇంకా పలువురు ముద్దుగుమ్మలు 'మేడ్ ఇన్ హెవెన్' సీజన్ 2 లో సందడి చేయబోతున్నారు. మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో సీజన్ 2 ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించినట్లుగా తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.
గత సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా పెళ్లిల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. మొత్తం 9 వివాహాల ను.. వాటి చుట్టు జరిగే కథల ను ఈ సీజన్ లో చూపించబోతున్నారట. ప్రతి పెళ్లి వేడుక చాలా స్పెషల్ గా ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
అర్జున్ మాధుర్ మరియు శోభితా ధూళిపాళ కాంబో సన్నివేశాలు ఆకట్టుకుంటాయట. హీరోయిన్స్ చాలా మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కడంతో పాటు పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. ప్రస్తుతం యూట్యూబ్ లో మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ట్రైలర్ తెగ సందడి చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ను ఆగస్టు 10వ తారీకు నుంచి స్క్రీనింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మొదటి సీజన్ ను చూసిన చాలా మంది సీజన్ 2 కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ వెబ్ సిరీస్ విభిన్నమైన స్క్రీన్ ప్లే తో మరియు పెళ్లి వ్యవస్థ గురించి, పెళ్లికి ముందు ఉండే హడావుడి గురించి చక్కగా చూపించబోతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.