ఆమె మిస్ చేసుకున్న లక్కీ ఛాన్స్ శోభితా కి..!
హిందీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్
By: Tupaki Desk | 8 Aug 2023 4:40 AMఈ మధ్య కాలంలో హిందీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2019 లో అమెజాన్ లో స్ట్రీమింగ్ అయింది. ఆ సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అందులో నటించిన తెలుగమ్మాయి శోభితా దూళిపాళ కి మంచి గుర్తింపు లభించింది.
సూపర్ హిట్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ఈనెల 10న స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ వెబ్ సిరీస్ కి భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. గత సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మంచి బజ్ క్రియేట్ అయింది.
ఈ వెబ్ సిరీస్ లో శోభితా ధూళిపాళ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించబోతుంది. మొదటి సీజన్ లో కూడా అదే పాత్రలో శోభిత కనిపించింది. ఇప్పుడు అదే పాత్ర కంటిన్యూ అవ్వబోతుంది. అర్జున్ మాథుర్ తో కలిసి శోభితా చేసిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.. సీజన్ 2 లో కూడా వీరి జోడీ రిపీట్ అవ్వబోతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ లో వెడ్డింగ్ ప్లానర్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ను సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పడంతో కొత్త అమ్మాయి అయితే బాగుంటుందనే ఉద్దేశ్యం తో 2019 లో శోభితా దూళిపాళ ను ఎంపిక చేయడం జరిగిందట.
మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యం లో సోనమ్ కపూర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మేడ్ ఇన్ హెవెన్ లో సోనమ్ నటించి ఉంటే తప్పకుండా ఆమెకు మంచి ఆఫర్లు దక్కి ఉండేవి అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ వల్ల శోభిత కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా శోభిత వరుస సినిమాలు చేస్తున్నదంటే కారణం మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ అనడంలో సందేహం లేదు.