విశాల్ మదగజరాజా.. ఏదో అనుకుంటో ఇంకేదో..
కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ దక్కలేదు. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. మద గజ రాజా కంటెంట్ రొటీన్ గా ఉందని తెలుగు సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు.
By: Tupaki Desk | 2 Feb 2025 1:30 AM GMTకోలీవుడ్ హీరో విశాల్ కు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన లాంగ్ టైమ్ పెండింగ్ మూవీ మద గజ రాజా.. ఏకంగా 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా షాకైపోయారు.
అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ మూవీ.. తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే నిన్న డబ్బింగ్ వెర్షన్ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లో మద గజ రాజా డబ్బింగ్ వెర్షన్ తడబడినట్లు స్పష్టమవుతోంది.
నిజానికి మేకర్స్.. తెలుగులో మేకర్స్ ప్రమోషన్స్ బాగానే చేపట్టారు. విశాల్ అటెండ్ అవ్వకపోయినా.. హీరోయిన్స్ అంజలి, వరలక్ష్మి సందడి చేశారు. కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ దక్కలేదు. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. మద గజ రాజా కంటెంట్ రొటీన్ గా ఉందని తెలుగు సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు.
అదే సమయంలో తమిళంలో మూవీ హిట్ అవ్వడానికి కారణాలివేనని కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పొంగల్ కానుకగా జనవరి 12వ తేదీన తమిళంలో రిలీజ్ అయింది. ఆ సమయంలో మరే ఇతర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. దాంతోపాటు సినిమాలోని సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సెలవులు కూడా కలిసొచ్చాయి.
దీంతో కోలీవుడ్ లో మద గజ రాజా మంచి హిట్ గా నిలిచింది. మణివణ్ణన్, మనోబాల వంటి దివంగత నటీనటులు సినిమాలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంతానం కామెడీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే తెలుగులో కూడా హిట్ అవుతుందని మేకర్స్ అనుకున్నా.. అలా జరగలేదు.
సంతానం కామెడీ, పంచ్ లు ఉన్నా.. కాన్సెప్ట్ కు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పాలి. సినిమాలో కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే అదే సమయంలో ఆ సినిమా ఇప్పుడు కాకుండా.. వేరే ఇతర మూవీస్ లేని టైమ్ లో రిలీజ్ అయ్యింటే కాస్త అయినా మంచి స్పందన వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తెలుగులో ఏదో అనుకుంటే ఇంకేదో అయింది!