Begin typing your search above and press return to search.

బ్రాండెడ్ బైక్ కంపెనీతో మాధ‌వ‌న్ బిగ్ డీల్!

ఇప్పుడు అత‌డు ఒక కొత్త బ్రాండెడ్ బైక్ ని కొనుగోలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 1:30 AM GMT
బ్రాండెడ్ బైక్ కంపెనీతో మాధ‌వ‌న్ బిగ్ డీల్!
X

కేవ‌లం క్రీడాభిమాని మాత్ర‌మే కాదు... కొత్త మోడ‌ల్ బైక్ లు కొన‌డంలో మ్యాడీ ఎప్పుడూ స్పీడ్ గా ఉంటాడు. ఇటీవ‌ల త‌ళా అజిత్ దుబాయ్ కార్ రేస్ లో గెలుపొందాక అభినందించిన మొద‌టి అభిమాని మాధ‌వ‌న్. ఇప్పుడు అత‌డు ఒక కొత్త బ్రాండెడ్ బైక్ ని కొనుగోలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్రతిష్టాత్మక ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన బ్రిక్ట్స‌న్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో అధికారికంగా డెలివరీలను ప్రారంభించ‌గా, మొదటి బ్రిక్ట్స‌న్ క్రోమ్‌వెల్ 1200ను ప్రఖ్యాత నటుడు ఆర్. మాధవన్ కొనుగోలు చేసారు. ఈ మైలురాయి భారత మార్కెట్ లో రాణించాల‌నే సంస్థ‌ నిబద్ధతను తెలియ‌జేస్తోంది. మోటార్‌సైకిల్ ఔత్సాహికులలో ఈ బ్రాండ్ పై చాలా ఉత్సాహం నెల‌కొంద‌ని కంపెనీ చెబుతోంది.

రెట్రో డిజైన్ల‌తో హై ఎండ్ ఉత్ప‌త్తుల‌తో బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్ భారతదేశానికి అద్భుతమైన లైనప్‌ను పరిచయం చేయడానికి మోటోహౌస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్రిక్స్టన్ పంపిణీదారు అయిన మోటోహౌస్ ఇప్పటికే బెంగళూరు, కొల్హాపూర్, గోవా, అహ్మదాబాద్ , సాంగ్లిలలో షోరూమ్‌లు ప్రారంభించింది. జైపూర్, మైసూరు, కోల్‌కతా, పూణే , న‌వీ ముంబై అధీకృత డీలర్‌షిప్‌లు వస్తున్నాయని స‌మాచారం.

కొత్త బైక్ ని అందుకున్న ఆర్. మాధవన్ మోటార్ సైకిల్ రైడింగ్‌పై ఆస‌క్తి గురించి మాట్లాడారు. ఈ బైక్ రెట్రో లుక్ అద్భుతం అంటూ పొగిడేశాడు మ్యాడీ. అధునాత‌న సాంకేతిక‌త‌తో రూపొందించిన ప్రీమియం బైక్ లు ఇవి అని తెలిపారు. రూ. 7,84,000 ఎక్స్-షోరూమ్ ధరతో, బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 దాని విభాగంలో అత్యంత పోటీ ధర కలిగిన మోటార్‌సైకిళ్లలో ఒకటి అని సంస్థ చెబుతోంది. 500cc నుండి 1200cc సెగ్మెంట్ వరకు టెస్ట్ రైడ్ ల‌కు ఈ బైక్ లు అందుబాటులో ఉన్నాయి. మ్యాడీ ప్ర‌చారంతో బ్రిక్స్ ట‌న్ కంపెనీకి మార్కెట్లో అదిరిపోయే ఫాలోయింగ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. మాధ‌వ‌న్ చేతికి అందిన‌ బ్రాండెడ్ బైక్ మార్కెట్లో సేల్స్ ప‌రంగా బుల్లెట్టును కొట్టేస్తుందా? లేదా! చూడాలి.