Begin typing your search above and press return to search.

హీరో లవ్‌, హార్ట్‌ ఎమోజీ వెనుక అసలు కథ ఇది..!

తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా పాన్‌ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న నటుడు మాధవన్‌.

By:  Tupaki Desk   |   5 March 2025 1:00 AM IST
హీరో లవ్‌, హార్ట్‌ ఎమోజీ వెనుక అసలు కథ ఇది..!
X

తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా పాన్‌ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న నటుడు మాధవన్‌. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా మూడు దశాబ్దాలు అవుతుంది. అయినా కూడా ఈయన నుంచి వరుసగా మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. నటుడిగా తనను తాను కొత్తగా చూపించేందుకు, విభిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అలాంటి మాధవన్‌ ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొనలేదు. ఆయన ఎప్పుడూ చాలా సింపుల్‌ జీవితాన్ని గడుపుతాడు అనే టాక్‌ ఉంది. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తాడు అంటూ టాక్‌ ఉంది.

ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఎదుర్కోని విమర్శలు, వివాదాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఒక అమ్మాయికి మాధవన్‌ లవ్‌ ఎమోజీని, హార్ట్‌ ఎమోజీని పంపించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయి అభిమానంతో సోషల్‌ మీడియా ద్వారా మెసేజ్ చేస్తే ఆమెకు లవ్‌ ఎమోజీలను షేర్ చేశాడు అంటూ మ్యాడీపై తీవ్ర స్థాయిలో ఒక వర్గం మీడియా విమర్శలు చేయడం మొదలు పెట్టింది. దాంతో పాటు ఆయన తీరును చాలా మంది విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఇన్నాళ్లుగా హీరో అంటూ అభిమానిస్తున్నాం. ఇతడి అసలు స్వరూపం విలన్‌ అంటూ కొందరు ఏకంగా సోషల్‌ మీడియా ద్వారా ఆయన్ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు.

మొత్తానికి మాధవన్‌ జీవితంలోనే అతి పెద్ద విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఆ విమర్శలపై నటుడు స్పందించాడు. తాను సోషల్‌ మీడియాలో ఒక అమ్మాయికి తప్పుగా మెసేజ్ చేసినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. అందులో కొందరికి తాను రిప్లై ఇస్తాను. అందరూ నా సినిమాలు చూసి బాగున్నాయి, నా సినిమాలు ప్రభావితంగా ఉన్నాయని కామెంట్‌ చేస్తూ ఉంటారు. అందులో కొందరికి నేను సమాధానంగా థాంక్స్ చెబుతూ ఉంటాను. అలా నాకు ఒక మెసేజ్ వచ్చింది.

మెసేజ్‌లో ఆ అమ్మాయి సినిమా బాగుందని, తన నటన ఎంతగానో నచ్చిందని, సినిమాతో తాను చాలా ఇన్‌స్ఫైర్‌ అయ్యాను అంటూ పేర్కొంది. అంతే కాకుండా చివర్లో లవ్‌, హార్ట్‌ ఎమోజీలను పంపించింది. తన మీద ఆమె చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశాను. థాంక్యూ సో మచ్‌.. గాడ్‌ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చాను. అదే సమయంలో చివర్లో ఆమె పెట్టినట్లుగానే లవ్‌, హార్ట్‌ ఎమోజీలను పెట్టాను. అయితే ఆమె ముందు ఆమె చేసిన మెసేజ్‌ను తొలగించి, తాను చేసిన మెసేజ్‌ను తొలగించి ఎమోజీల వరకు ఉంచింది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆమె చేసిన పనితో తనకు సోషల్‌ మీడియాలో ఎవరికి అయినా సమాధానం ఇవ్వాలన్నా భయంగా ఉందని మాధవన్ చెప్పుకొచ్చారు.