Begin typing your search above and press return to search.

పదే పదే చూసే అలవాటు నాకు లేదు

ఎంత సంపాదిస్తున్నానో తనకు తెలుసు... నా సంపాదన గురించి నాకు పూర్తిగా తెలుసు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 2:45 AM GMT
పదే పదే చూసే అలవాటు నాకు లేదు
X

పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ హీరో మాధవన్‌ తాజాగా 'హిసాబ్ బరాబర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటిలాగే కొత్త తరహా కథతో ప్రేక్షకులను పలకరించిన మాధవన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ఆ సమయంలో తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా తన యొక్క బ్యాంక్‌ బ్యాలెన్స్ గురించి ఆయన స్పందించారు. ఎంత సంపాదిస్తున్నానో తనకు తెలుసు... నా సంపాదన గురించి నాకు పూర్తిగా తెలుసు. కనుక ఎప్పుడు ఆర్థిక పరమైన ఆలోచన ఉండదని అన్నారు.

మాధవన్ మాట్లాడుతూ... ప్రస్తుతం నా బ్యాంక్ ఖాతాలో ఎంత అమౌంట్‌ ఉంది అనేది నాకు తెలియదు. పదే పదే నేను బ్యాంక్‌ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోను. నా సంపాదన గురించి, నాకు వచ్చే ఆధాయం గురించి తెలుసు. కనుక నేను ఎందుకు పదే పదే బ్యాంక్‌ ఖాతాలో ఎంత ఉందో చెక్‌ చేసుకుంటాను అన్నాడు. తన బ్యాంక్‌ అకౌంట్‌ గురించి ఎక్కువ పట్టించుకోను. ఆదాయం, వ్యయం గురించి ఎక్కువ ఆలోచన లేదు. ఆర్థిక పరమైన ఆలోచనలు ఎక్కువగా చేయను అన్నాడు. బ్యాంక్‌ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను పదే పదే చెక్‌ చేయడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటూ మాధవన్ ప్రశ్నించారు.

సాధారణంగా తాను ఎక్కువగానే ఖర్చు పెడతాను. నా స్థాయికి తగ్గట్లుగా, నా సంపాదనకు తగ్గట్లుగా ఖర్చులు చేస్తూ ఉంటాను. లగ్జరీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అవసరాలకు కచ్చితంగా ఖర్చు చేస్తాను. నాకు అవసరం అయిన వస్తువులు ఎక్కువ బడ్జెట్‌లో ఉంటే కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తాను. నా స్టార్‌డం చూపించేందుకు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని అసలు భావించను. నా వద్ద ఉన్న వస్తువులతో స్టార్‌డం వస్తుందని అనుకోవడం లేదు. నాకు అభిమానులు చూపించే అభిమానంతోనే స్టార్‌డం వస్తుందని భావిస్తాను. వారి అభిమానం నా సంపదగా భావిస్తాను అన్నారు.

కోవిడ్‌ కారణంగా తనలో వ్యక్తిగతంగా చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కొన్ని విషయాలను లోతుగా తెలుసుకుంటూ ఉన్నాను. కొత్త విషయాలు ఏమైనా ఉంటే వాటి పట్ల శ్రద్ద పెట్టి నేర్చుకుంటున్నట్లు తెలియజేశాడు. తనకు ఒక పడవ ఉందని, దాన్ని నడిపేందుకు గాను లైసెన్స్‌ను కూడా పొందినట్లు మాధవన్‌ పేర్కొన్నాడు. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను కోల్పోవద్దని, తద్వారా జీవితం సంతోషంగా సాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ మాధవన్‌ నటిస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.