తండ్రితో ఘర్షణను గుర్తు చేసుకున్న మ్యాడీ
భారతదేశంలోని ఫైనెస్ట్ నటులలో ఒకరిగా ఆర్.మాధవన్ కి గుర్తింపు ఉంది.
By: Tupaki Desk | 17 March 2024 2:41 PM GMTభారతదేశంలోని ఫైనెస్ట్ నటులలో ఒకరిగా ఆర్.మాధవన్ కి గుర్తింపు ఉంది. తనదైన నట ప్రతిభ, వైవిధ్యంతో ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తాడు మ్యాడీ. అందుకే అతడి కంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
ఇటీవలి పోడ్‌కాస్ట్ లో R మాధవన్ తన తండ్రితో జరిపిన లోతైన వ్యక్తిగత సంభాషణ, ఎమోషనల్ ఘట్టం గురించి ఓపెనయ్యాడు. ఇది బ్లాక్ బస్టర్ `3 ఇడియట్స్`లోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. 8వ తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత తన తండ్రి ఎంతగా నిరాశపడ్డారో మ్యాడీ వెల్లడించాడు. ఆ సమయంలో అతడు గణితంలో కేవలం 39 శాతం మార్కులు సాధించాడు. తన కొడుకు టాటా స్టీల్‌లో ఉద్యోగం సంపాదించి బాగా స్థిరపడాలని అతని తల్లిదండ్రులు ఆశించినప్పటికీ, మాధవన్ ఫస్ట్ క్లాస్ విద్యార్థి కాదనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఒక బాధాకరమైన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. మాధవన్ తన తండ్రితో కలిసి రైల్వే ట్రాక్‌పై నడుస్తున్నప్పటి ఘటనను వివరించాడు. ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మరో తిరస్కరణకు గురైన తర్వాత సంఘటన ఇది.. ``నేనేం తప్పు చేశాను?`` అని అడిగేసరికి తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది అతడి తండ్రి నుండి భావోద్వేగాల పరంగా అరుదైన సన్నివేశం.. మాధవన్ జ్ఞాపకాల్లో లోతుగా పాతుకుపోయిన సంఘటనలు అవి.
మాధవన్ స్పందిస్తూ తన భవిష్యత్ కెరీర్ గురించి అనిశ్చితి ఉందని అన్నాడు. కానీ అతడు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. అతను తన తండ్రి అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడలేదు. అతడు నిజాయితీగా దీనిని ఒప్పుకున్నాడు. నేను 30 సంవత్సరాలు డెస్క్ వద్ద కూర్చుంటే.. ఎవరినైనా చంపేస్తాను. నేను దాని కోసం పని చేయలేను`` అన అన్నాడు. తనపై ఉంచిన సాంప్రదాయ అంచనాలకు వ్యతిరేకంగా ధిక్కరించే క్షణం అది. నిజానికి ఇది మాధవన్ `3 ఇడియట్స్` లో పోషించిన పాత్రను గుర్తుకు తెస్తుంది.సినిమా చూసిన వారికి ఈ సంభాషణలో మాధవన్ పాత్ర ఇంజినీరింగ్ చేయాలనే తండ్రి కోరికకు వ్యతిరేకంగా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలని కలలు కనే సన్నివేశాన్ని ప్రతిబింబిస్తుంది.
కుటుంబ అంచనాలు వ్యక్తిగత ఆకాంక్షల మధ్య ఘర్షణను నావిగేట్ చేసేటప్పుడు చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే పోరాటాల గురించి మాధవన్ పోరాటం అర్థమయ్యేలా చెబుతోంది. స్వీయ-ఆవిష్కరణకు మార్గం వెతుక్కోవడం తరచుగా సవాళ్లను ఇది గుర్తు చేస్తుంది. R మాధవన్ నిజ జీవిత కథలో కుటుంబ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, తనకు తానుగా ఉండాలనే పట్టుదలను ఆవిష్కరిస్తుంది.