Begin typing your search above and press return to search.

బ‌రువు త‌గ్గ‌డానికి మ్యాడీ షాకింగ్ చిట్కా

బాగా న‌మిలి తిన‌డం, ఉపవాస దినచర్య పాటించ‌డం గురించి వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 July 2024 8:48 AM GMT
బ‌రువు త‌గ్గ‌డానికి మ్యాడీ షాకింగ్ చిట్కా
X

బ‌రువు త‌గ్గ‌డానికి చాలామంది అనుస‌రించే మార్గాలు తెలిసిందే. జిమ్ కి వెళ్లి తీవ్రంగా శ్రమించ‌డం.. వాకింగ్ జాగింగ్ .. యోగా ప్రాణాయామం అంటూ ర‌క‌ర‌కాల విధానాల‌ను అనుస‌రించ‌డం.. దానికి తోడు వ‌రి అన్నం తిన‌క‌పోవ‌డం వ‌గైరా వెయిల్ లాస్ చిట్కాలుగా భావిస్తారు.

కానీ అందుకు పూర్తి భిన్న‌మైన చిట్కాను అనుస‌రించి తాను బ‌రువును త‌గ్గించాన‌ని చెబుతున్నారు ఆర్.మాధ‌వ‌న్. అడపాదడపా ఉపవాసం ఆహారాన్ని ఎక్కువగా నమలడం ప్రాముఖ్యతను మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ నొక్కి చెప్పారు. బరువు తగ్గడం, ఫిట్‌నెస్ కోసం తాను విభిన్న‌మైన ప‌ద్ధ‌తిని అనుస‌రించారు. బాగా న‌మిలి తిన‌డం, ఉపవాస దినచర్య పాటించ‌డం గురించి వెల్లడించారు. ఆహారాన్ని నమలడం, నీరు త్రాగడం ప్రాముఖ్యతను వివ‌రించాడు. ఇప్పుడు మ్యాడీ మారిన రూపం చూసాక‌ అభిమానులు అతడి విధానాన్ని ప్రశంసించారు. ఈ విధానం అంద‌రికీ స్ఫూర్తినిస్తుంది.

వేకువ‌ఝామున నీరు తాగడం, 6:45 PM తర్వాత భోజనానికి దూరంగా ఉండటం బ‌రువు త‌గ్గ‌డంలో త‌న‌కు స‌హ‌క‌రించాయ‌ని మాధ‌వ‌న్ తెలిపాడు. ఆహారాన్ని 45-60 సార్లు నమలడం (మీ ఆహారం త్రాగండి - మీ నీటిని నమలండి) చేయాలి. చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు ముగించాలి. వండిన ఆహారం మాత్రమే తినాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వండిన‌వి మాత్ర‌మే తినాలి.. ప‌చ్చివి అవ‌స‌రం లేదు. ఉదయాన్నే సుదీర్ఘ నడకలు, పొద్దున్న‌, రాత్రి గాఢ నిద్ర అవ‌స‌రం. నిదుర పోవ‌డానికి 90 నిమిషాల ముందు స్క్రీన్ లు చూడ‌కూడ‌దు.. అని తెలిపాడు.

వ్యాయామం, పరుగు, మందులు లేదా శస్త్రచికిత్స లేకుండా తన బొడ్డు కొవ్వును ఎలా తగ్గించుకున్నాడో గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో వివరించాడు. తన శరీరానికి అవసరమైన వాటిని మాత్రమే తినడంపై దృష్టి పెట్టాన‌ని, 21 రోజుల్లో బరువు తగ్గాన‌ని తెలిపాడు. మ్యాడీ ఆరోగ్య చిట్కా ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. గొప్ప పురోగతి మ్యాడీ అంటూ అభిమానులు ప్ర‌శంసించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. R మాధవన్ చివరిగా డార్క్ హారర్ చిత్రం `షైతాన్‌`లో కనిపించారు. అజయ్ దేవగన్ జ్యోతిక ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌దుప‌రి సిద్ధార్థ్- నయనతారలతో తమిళ చిత్రం `పరీక్ష`లో న‌టించాడు. ఇది విడుదలకు సిద్ధ‌మవుతోంది.