ఇలా ఇచ్చుకుంటే వెళ్తే అడుక్కు తినడమే.. తారక్ ఫ్యాన్ తల్లిపై మాధవి ఫైర్!
కానీ తమకు ఇప్పటి వరకు తారక్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని రీసెంట్ గా కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు.
By: Tupaki Desk | 24 Dec 2024 4:51 AM GMTదేవర సినిమా టైమ్ లో క్యాన్సర్ తో బాధపడుతున్న తన ఫ్యాన్ కౌశిక్ కు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తమకు ఇప్పటి వరకు తారక్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని రీసెంట్ గా కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. అప్పుడు సాయం చేస్తానని, ఇప్పుడు మాట తప్పారని ఆరోపణలు చేశారు.
దీంతో ఆ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అదే సమయంలో నటి మాధవీలత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రెస్పాండ్ అయ్యారు. తీవ్రంగా మండిపడ్డారు. అలా అభిమానులకు హీరోలు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినాలని అభిప్రాయపడ్డారు. ఆశించే వాళ్లు ఫ్యాన్స్ ఎలా అవుతారని ప్రశ్నించారు.
సరస్వతి మాట్లాడిన వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. "ఐతే ఏం చేద్దాం.. ఫ్యాన్స్ కు డబ్బులిస్తూ పోతే రోడ్ పై అడక్కు తింటారు హీరోస్.. అభిమాని అంటే ఆశించేవాడు కాదు.. అందుకే అభిమాని అంటారు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం.. ఆశిస్తే స్వార్థం అవుద్ది.. అభిమానం ఎలా అవుద్ది?" అని క్వశ్చన్ చేశారు.
"అయితే ఇంకా రోజుకొకరు బయటకు వస్తారు.. స్టోరీస్ పట్టుకుని ఫిల్మ్ నగర్ లో చాలా మంది తిరుగుతారు.. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది" అని అన్నారు. ఇప్పుడు మాధవీలత పోస్ట్.. వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు యాంటీగా మాట్లాడుతున్నారు. అలా ఆర్థిక సహాయం విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
తిరుపతికి చెందిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్ ఫ్యాన్. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తనను దేవర విడుదల అయ్యే వరకైనా బ్రతికించండంటూ కౌశిక్ వేడుకున్నాడు. ఆ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు చేరింది. దీంతో వాళ్లు తారక్ తో మాట్లాడించారు. అప్పుడు ఆయన.. ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఒక్క పైసా అందలేదని ఆరోపిస్తున్నారు కౌశిక్ తల్లి సరస్వతి.
అయితే కౌశిక్ కు చికిత్స పూర్తయిందని, ప్రభుత్వం నుంచి రూ.11 లక్షలు, టీటీడీ నుంచి రూ.40 లక్షల ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. ఇప్పుడు డిశ్చార్జ్ టైమ్ లో ఇంకా రూ. 20 లక్షలు కట్టాలని ఆస్పత్రిలో చెల్లించాలని, కాబట్టి తమకు సహాయం చేయాలని వేడుకున్నారు. ఎన్టీఆర్ కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరారు.