అలాంటి తల్లుల్ని చూసి సిగ్గుపడుతున్నాను! మాధవిలత
ఓ నటుడు ఈ ఫోటోని షేర్ చేయడం వల్ల మళ్లీ స్పందించాల్సి వచ్చిందంటూ మాధవి మళ్లీ ముందుకొచ్చింది.
By: Tupaki Desk | 24 April 2024 11:42 AM GMTకొన్ని నెలల క్రితం ఓ అమ్మాయి అచేధనంగా గీసిన పెయింటింగ్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోని నటి మాధవి లత తన ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ కూడా చేసింది. తాజాగా ఆ ఫోటో మళ్లీ వైరల్ గా మారింది. ఓ నటుడు ఈ ఫోటోని షేర్ చేయడం వల్ల మళ్లీ స్పందించాల్సి వచ్చిందంటూ మాధవి మళ్లీ ముందుకొచ్చింది. దానికి సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. దాంతో పాటు తన భావాల్ని పంచుకుంది.
`ఆడదాని యోని అంటే చాలా మంది కేవలం సుఖ స్థానం అని మాత్రమే అనుకుంటారు. కానీ అదే యోనిని జననేంద్రియం అని కూడా అంటారు. అంటే జననానికి కారణమైన స్థానం. ఇప్పటి వరకు పుట్టిన అవతార పురుషులైనా, జగజ్జెతలైన అక్కడినుండే పుట్టారు.ఇన్ని యుగాలు, కోటాను కోట్ల సంవత్సరాలైనా చిన్న చీమ నుండి, దేవుళ్ళు దాకా అందరినీ ఈ సృష్టిలోకి తీసుకోచ్చిన మాహా ద్వారమే, మాతృత్వపు మార్గమే ఆ మహాస్థానం. దాన్ని మర్మ స్థానం అని పిలిచినా అది ముమ్మాటికీ మానవాళి ధన్య స్థానం, పుణ్య స్థానం.
అలాంటి స్థానాన్ని గౌరవించలేని నీచులు, స్త్రీ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి జన్మనిచ్చే, జగతిని పెంచే మహా స్థానానికి మర్యాద ఇవ్వలేని మనిషాసురులను కని లోకంమీదకు వదిలేసిన తల్లులను చూసి స్త్రీగా సిగ్గు పడుతున్నాను. అతి త్వరలో అమ్మతనాన్ని అవమానించే ఈ మనిషాసురులను అంతమోందించే ఆదిశక్తి అవతరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటె ఆడవారి ఆత్మగౌరవం కాపాడడం కోసం, మాట్లాడడం కోసం మనసున్న మగవాళ్ళు వస్తారనే నమ్మకం తగ్గిపోయింది.
ఆఫ్ కోర్స్ సాటి ఆడదాని పైన అసూయతో నిందలు వేసే ఆడవారు కూడా ఉన్న సమాజంలో ఆడవారు కూడా ఉద్దరిస్తారనే నమ్మకం లేదు. కానీ ఏమీ చేయలేనప్పుడు దేవుణ్ణి తప్ప ఎవరిని అడుగుతాం. అందుకే భారం అమ్మవారిపై వేయడమే` అని రాసుకొచ్చారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కామెంట్ బాక్స్ లో ఎవరికి తోచినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఓ మహిళని ఇలా చూపించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫోటో గీస్తారాని మండిపడుతున్నారు.