SSMB 29 పెద్ద లీకిచ్చిన హీరోయిన్ మమ్మీ
సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న SSMB 29 గురించి చాలా చర్చ సాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ మొదటి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది.
By: Tupaki Desk | 2 March 2025 10:12 AM GMTసూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న SSMB 29 గురించి చాలా చర్చ సాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ మొదటి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోందని ప్రచారం సాగుతున్నా దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.
త్వరలోనే రాజమౌళి అండ్ టీమ్ కాస్టింగ్ గురించి వివరాలు అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రియాంక చోప్రా గత నెలరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ షూటింగుల్లో పాల్గొనడం, అలాగే సమీపంలోని దేవాలయాలను సందర్శించడం వగైరా వ్యవహారాలకు మీడియాలో బోలెడంత ప్రచారం లభించింది. మహేష్, రాజమౌళి బృందంతో పని చేస్తోందని సన్నిహిత వర్గాలు లీకులు ఇస్తున్నాయి. కానీ దీనిని ప్రియాంక చోప్రా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
తాజా సమాచారం మేరకు... ప్రియాంక SSMB 29 లో నటిస్తోందా? అని ప్రశ్నించగా, ఆమె తల్లి మధు చోప్రా ``అవును.. సినిమా షూటింగ్ చేస్తోంది`` అని చెబుతూ ట్రెండింగ్ బజ్‌ను ధృవీకరించారు. ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా, అవును అంటూ మధూ తల ఊపారు. ఓవైపు పీసీ మహేష్ సరసన నటిస్తోందనే ఊహాగానాలు సాగుతుండగా మధు చోప్రా దీనిని ఖరారు చేసారు. మధూ టొరంటో నుండి హైదరాబాద్‌కు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసే వీడియోలో ఈ విషయాన్ని లీక్ చేసారు. దీనిలో రోర్ ఆఫ్ RRR నేపథ్య సంగీతం రాజమౌళితో పీసీ కలిసి పనిచేస్తోందనే విషయాన్ని క్లియర్ చేసింది.
ఇంతకుముందు హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలను కూడా షేర్ చేసారు. శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పీసీ ధృవీకరించారు. దీంతో ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లో ఉందని అభిమానులు భావించారు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌లో ఆమె పాత్రను అధికారికంగా ధృవీకరించలేదు. విజయేంద్ర ప్రసాద్ ఇండియానా జోన్స్ ప్రేరణతో ఈ కథను రాసారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఈ ప్రాజెక్ట్ జనవరిలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. అయినప్పటికీ నిర్మాతలు మహేష్ బాబు లుక్‌ను గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికి వివరాలు రహస్యం. త్వరలోనే దీనిపై సర్వసమాచారం అందిస్తారని భావిస్తున్నారు.